టిక్ టాక్ నిషేధించడంతో ఇతర యాప్ లకు పెరుగుతున్న యూజర్లు...

ఇటీవలే భారతదేశంలో చైనా దేశానికి సంబంధించినటువంటి 51 యాప్ లను  నిషేదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇందులో భాగంగా టిక్ టాక్ యాప్ కూడా నిషేధించబడిన యాప్ లిస్టులో ఉంది.

 Instagram,  Chingari App, Tik Tok, Social Media, India, China Apps-TeluguStop.com

అయితే ప్రస్తుతం టిక్ టాక్ యాప్ భారతదేశంలో  బాగా పాపులర్ అయ్యింది.అంతేగా క మొదట్లో కాలక్షేపం కోసం వినియోగించిన ఈ యాప్ కి ఎంతో మంది బానిసలు అయ్యారు.

అయితే ఉన్నట్టుండి దేశంలో టిక్ టాక్  యాప్ ని ఒక్కసారి గా నిషేధించడంతో ఎక్కువ సమయం ఎంటర్ టైన్ మెంట్ కోసం చూసేటువంటి వారు ఇంస్టాగ్రామ్, చింగారి, టెలిగ్రామ్, హాగో, పబ్ జీ తదితర అప్లికేషన్ల వైపు చూస్తున్నారు.ఈ క్రమంలో ఈ అప్లికేషన్లకు  వినియోగదారులు కూడా పెరిగినట్లు సమాచారం.

మరోవైపు యూట్యూబ్ కూడా టిక్ టాక్ యాప్ ని తలదన్నే విధంగా ఫీచర్లను అందిస్తూ కొత్త యూజర్లను బాగానే ఆకట్టుకుంటోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా భారతదేశంలో టిక్ టాక్ యాప్ కోసం పని చేసేటువంటి అధికారులు మళ్లీ టిక్ టాక్ యాప్ ని దేశంలో పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అంతేగాక ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడా ఈ విషయానికి సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నట్లున్ సోషల్ మీడియా మాధ్యమాలలో పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే ఎక్కువ మంది నెటిజన్లు మాత్రం టిక్ టాక్ యాప్ ని మళ్లీ దేశంలో కి అనుమతించాలంటూ కోరుతున్నారట.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube