అక్కడ పురుగుల వేటకు వందల మంది వెళ్తారు ఆ పురుగుల గురించి తెలిస్తే మీరు ప్రయత్నిస్తారేమో

హిమాలయాల్లో అద్బుతమౌన ఔషద మ్కొలు మరియు మూలికలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు మరియు శాస్త్రవేత్తలు అంటున్నారు.హిమాలయా ప్రాంతంలో లభించే కొన్ని ఔషదాల వల్ల క్యాన్సర్‌ వంటి మహమ్మారి కూడా నయం అవుతుందని డాక్టర్లు అంటున్నారు.

 Insect In Himalayas Is Very Costly Telugustop1 1 1-TeluguStop.com

మనం కొన్ని రోజుల క్రితం హిమాలయాల్లో చిన్న మొక్క మూలిక కోసం జనాలు వందల మంది వెళ్లి కొద్ది మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారని, రోజుకు ఒక్కటి లేదా రెండు మొక్కలు దొరికినా వారికి పండగే అన్న కథనం చూశాం కదా, ఇప్పుడు అలాంటి కథనం ఇది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… హిమాలయ ప్రాంతంలోనే కనిపించే ఒక అరుదైన కీటకం ఔషదంగా బాగా ఉపయోగపడుతుందట.దాంతో ఆ కీటకంను భారీ మొత్తం డబ్బులు పెట్టి కొనుగోలు చేసేందుకు ఔషద కంపెనీలు సిద్దంగా ఉంటాయి.దాంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆ కీటకంను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.ఆగస్టు వరకు స్థానిక జనాలు ఆ కీటకం కోసం జల్లెడ పడుతూ ఉంటారు.

అక్కడ పురుగుల వేటకు వందల మంది

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ కీటకంను పరిశోదన కేంద్రాలు మరియు మెడికల్‌ కంపెనీలు కిలోకు దాదాపుగా 60 లక్షల వరకు కొనుగోలు చేస్తారు.రెండు నుండి నాలుగు అయిదు గ్రాములు ఉండే ఒక్క కీటకం లభిస్తే పది వేల వరకు ఆ రోజు సంపాదించినట్లే.ఇండియన్‌ మార్కెట్‌లో 60 లక్షలు ఉంటే విదేశీయులు కోటి రూపాయలు పెట్టేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లుగా పుకార్లు జరుగుతున్నాయి.ఇంత ఖరీదైన ఆ కీటకం కేవలం హిమాలయాల్లో మాత్రమే కనిపిస్తుంది.

మీరు ప్రయత్నించకండి అది కేవలం అక్కడ లభిస్తుంది.ఇక్కడ మనకు కనిపించే కీటకాలు 60 లక్షలు కాదు కదా, కనీసం ఆరు రూపాయలు కూడా ధర పలకదు గుర్తించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube