స్విగ్గిలో హల్వా ఆర్డర్ చేసాడు... కానీ తెరిచి చూసి ఖంగుతిన్నాడు..?

ఒకప్పుడైతే ఆహారం కావాలి అంటే హోటల్ కు వెళ్లి తెచ్చుకునేవారు.కానీ ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ వచ్చిన తర్వాత అందరూ హోటల్కు వెళ్లి ఫుడ్ తెచ్చుకోవడమే మర్చిపోయారు.

 Online Food Delivery, Swiggy, Halwa, Insect In Food-TeluguStop.com

అయితే ఇలా ఫుడ్ డెలివరీ సర్వీసులను అందిస్తున్న సంస్థలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.ఇలాంటి వాటిలో ఒకటి స్విగ్గి.

అయితే కొన్ని కొన్ని సార్లు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు జరిగే సంఘటనలు చూస్తే ఏకంగా ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

స్విగ్గి ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసిన ఖంగు తిన్నాడు.హైదరాబాద్ చెందిన బెల్లం శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ పాపులర్ హోటల్ నుంచి హల్వా ఆర్డర్ చేసాడు.

ఇక అతను ఆర్డర్ చేసిన హల్వా రానే వచ్చింది.దీంతో ఎంతో ఆతృతగా హల్వాని ఆరగించాలి అని పార్సల్ ఓపెన్ చేసి చూశాడు.

ఇంతలో ఆహారం లో ఏదో తేడా కనిపించింది.కాస్త గమనించి చూస్తే అది పురుగు.దీంతో షాక్ కి గురైన శ్రీనివాస్ ఆహారాన్ని తినకుండానే పారవేశాడు.ఇక అలా పారవేసే ముందు ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ స్విగ్గీ ని ట్యాగ్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ గా మారిపోయింది.

దీనిపై స్పందించిన స్విగ్గి అసౌకర్యానికి చింతిస్తున్నాము అంటూ సంజాయిషీ చెప్పుకొచ్చింది.అయితే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ చేసినప్పుడు ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube