ధృవ‌పు ఎలుగుబంట్ల‌ను కాపాడాలంటూ వినూత్న ప్ర‌చారం.. ఎలా చేశారో తెలిస్తే..

ఏ దేశ‌మైతే జ‌న‌భా త‌క్కువ క‌లిగి ఉంటుందో ఆ దేశం తొంద‌ర‌గా అభివృద్ధి చెందుతుంది.అంతేగాకుండా జ‌నాభా త‌క్కువ‌గా ఉంటే స‌హ‌జ‌వ‌న‌రులను త‌క్కువ‌గా వినియోగించుకోవ‌చ్చు.

 Innovative Campaign To Save Polar Bears  If You Know How They Did It , Innovativ-TeluguStop.com

స‌హ‌జ‌వ‌నరుల‌పై స‌ర్వ‌కోటి జీవ‌రాశులు ఆధార‌ప‌డి ఉంటాయి.ఏ జీవ‌రాశికైనా స‌హ‌జ‌వ‌న‌రులే ముఖ్యం.

ఇంకో ముఖ్య విష‌యం ఏమిటంటే స‌హ‌జ‌వ‌న‌రులు మ‌నుషుల కంటే జంతువుల‌కే ఎక్కువ అవస‌రం.ప్రపంచంలో రోజు రోజుకూ జ‌న‌భా పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు.

జనాభాతో పాటు అవ‌స‌రాలు కూడా పెరుగుతున్నాయి.మ‌న అవ‌స‌రాల కోసం అడువులు చెట్లు, సముద్రాలు, నదులను మ‌నం ఇస్టానుసారంగా వాడుకుంటున్నాం.

అదే ఇప్పుడు ఇతర జీవాల పాలిట శాపంగా మారింది.గత 50 ఏండ్ల‌లో జ‌నాభా రెండు రెట్లు పెరిగితే, జీవాల సంఖ్య స‌గానికి స‌గం ప‌డిపోయాయి.

జ‌నాభా త‌క్కువ ఉన్న‌చోటే జంతువులను కాపాడుకునే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

అంతేగాకుండా పది లక్షల జీవజాతులు అంత‌రించే స్థాయికి దిగ‌జారింది.

ఇలా దిగ‌జార‌డంతో కాలిఫోర్నియాలోని సెంటర్ ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ ఓ వినూత్నఆలోచ‌న చేసింది.ఈ నెల 25న వరల్డ్ కాంట్రసెప్టివ్ డే సంద‌ర్భంగా కాలిఫోర్నియాలోని 12 విద్యాసంస్థల్లో స్టూడెంట్స్ కు కండోమ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

Telugu Bear, Innovative-Latest News - Telugu

ఆ కండోమ్ ప్యాకెట్లపై అంత‌రించిపోతున్న జీవాల‌ను ర‌క్షించాల‌ని ముద్రించారు.కండోమ్స్ ఉప‌యోగించడం వ‌ల్ల ఇప్పుడు ధృవపు ప్రాంతాల్లో నివ‌సిస్తున్న ఎలుగబంట్లను రక్షించాలంటూ ఎంతో ఆకర్షణీయమైన స్లోగ‌న్స్‌తో ప్రజల్లో అవగాహన పెంచారు.గర్భనిరోధక సాధనాలతో జనాభాను త‌గ్గించ‌వ‌చ్చ‌ని, దాంతో ప‌రోక్షంగా ప్రకృతిని కాపాడుకోవ‌చ్చ‌నే అంశాన్నిప్ర‌జ‌ల్లోకి పంపించారు.కాగా ఈ సున్నిత‌మైన అంశంపై ఏదో ఒక చోట కొంచెం డిఫ‌రెంట్ గా చ‌ర్చ సాగిస్తే చివ‌ర‌కు అది ప్ర‌కృతి వైపు తొలి ప్ర‌య‌త్నంగా మారే ఛాన్స్ ఉంద‌ని సెంటర్ ఫర్ బయోలాజికల్ డైవర్శిటీ ఆలోచించింది.

జనాభా పెరుగుదులతోనే స‌హ‌జ‌వ‌న‌రులు అంత‌రించిపోతున్నాయ‌ని, స‌హ‌జ‌వ‌న‌రుల త‌గ్గుద‌ల‌తో అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయ‌ని పేర్కొంది.ప్ర‌స్తుతం ఈ ప్ర‌చారం అనేక మందిని ఆక‌ర్షిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube