చాలా పెద్ద తప్పు చేశానంటూ మదన పడుతున్న దర్శకుడు క్రిష్‌

విభిన్న చిత్రాలతో దర్శకుడిగా మొదట విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు క్రిష్‌ ఆ తర్వాత కమర్షియల్‌ దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు.తెలుగు మరియు హిందీల్లో కూడా ఈయన సినిమాలు మంచి ఆధరణ పొందాయి.

 Inner Feeling Of Director Krish About Ntr Kathanayakudu-TeluguStop.com

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందిన ‘మణికర్ణిక’ చిత్రంను క్రిష్‌ రూపొందించిన విషయం తెల్సిందే.

ఆ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని భావించిన సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి చిన్న చిన్న విభేదాలు వచ్చాయి.అయితే వాటిని సరి చేసుకోలేనంత మాత్రం కాదు.ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ సినిమా ఆఫర్‌ వచ్చింది.

‘మణికర్ణిక’ వంటి భారీ ప్రతిష్టాత్మక సినిమాను వదిలేసి ఎన్టీఆర్‌ బయోపిక్‌ను నెత్తికి ఎత్తుకున్నాడు.ఆ సమయంలో మణికర్ణిక కంటే కూడా ఎన్టీఆర్‌ బయోపిక్‌ ను గొప్ప సినిమాగా క్రిష్‌ భావించాడు.

తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎన్టీఆర్‌ గురించి, ఆయన జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.

అలాంటి సినిమా తీస్తే దర్శకుడిగా చరిత్రలో నిలిచి పోతానని క్రిష్‌ భావించి మణికర్ణిక చిత్రాన్ని చివరి దశలో వదిలేసి ఎన్టీఆర్‌ సినిమాను మొదలు పెట్టాడు.మణికర్ణిక చిత్రంను క్రిష్‌ వదిలేసిన తర్వాత కంగనా మొత్తం కెలికేసింది.దాదాపు అయిదు నెలల పాటు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని మార్పులు చేర్పులు చేసింది.

పేరు వేసినా కూడా మణికర్ణిక సక్సెస్‌ అయితే ఆ క్రెడిట్‌ మొత్తం కూడా ఖచ్చితంగా కంగనాకే వెళ్తుంది.

మణికర్ణిక ద్వారా వచ్చే పేరు పోయింది, ఎన్టీఆర్‌తో చరిత్రలో నిలిచి పోతానని భావించిన క్రిష్‌కు ఇక్కడ కూడా నిరాశే మిగిలింది.ఎన్టీఆర్‌ చిత్రం నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుందని ప్రచారం చేశారు.సినిమాకు పాజిటివ్‌ టాక్‌ అయితే వచ్చింది.

కాని కలెక్షన్స్‌ మరీ దారుణంగా వచ్చాయి.క్రిష్‌ పరువు పోయింది.

క్రిష్‌ మొత్తం కూడా బాలయ్య కను సన్నల్లో సినిమా చేశాడని, చంద్రబాబు సూచనల మేరకు పని చేశాడంటూ మరక వేయించుకున్నాడు.ఇలాంటి అపవాదు రావడంతో ఇప్పుడు క్రిష్‌ అయ్యే మణికర్ణిక చిత్రాన్ని వదిలేసి ఎన్టీఆర్‌ వద్దకు అనవసరంగా వచ్చానే అంటూ మదన పడుతున్నాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube