అర్జెంట్ పని ఉంది 15 రోజుల్లో తిరిగొస్తాం.. లేఖ రాసి జంప్ అయిన ఖైదీలు?

సాధారణంగా అయితే జైలు నుంచి ఖైదీలు పారిపోతున్న ఘటనలు గురించి మనం వింటూంటాం.ఇక పారిపోయిన ఖైదీలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరగడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు.

 Inmates ,prison ,leave Note, Promising ,return, Two Weeks-TeluguStop.com

అదే సమయంలో పోలీసులు కూడా పారిపోయిన ఖైదీలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.అంతేకాని పారిపోయిన ఖైదీలు మళ్ళీ తిరిగి వస్తాం మాకోసం వెతకొద్దు అని చెబుతారా.పారి పోయాక ఎందుకు తిరిగి వస్తారు… అలా ఎందుకు చెబుతారు అని అంటారా… కానీ ఇక్కడ ఇద్దరు ఖైదీలు వ్యవహరించిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

15 రోజుల్లో తిరిగి వస్తాం… మా కోసం వెతుకొద్దు అంటూ ఇక్కడ ఖైదీలు లేఖ రాసి జైలు నుంచి పారిపోయారు.లేక చూసి అటు పోలీసు అధికారులు సైతం అవాక్కయ్యారు.ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకోలేదు.దవాద్ జూకానవిక్, లిల్ అమోటవిక్ అనే ఇద్దరు సోదరులు మోసాలు దొంగతనం నేరం కింద ఇటలీలోని రెబ్బిబియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.ఇక జూన్ 2వ తేదీన ఇద్దరు ఖైదీలు కిటికీ ఊచలు కోసి అక్కడి నుంచి పరారయ్యారు.

అక్కడినుంచి ఎవరికీ కనిపించకుండా జైలుగోడల దూకేసి పారిపోయారు.కానీ వెళ్తూ వెళ్తూ ఖైదీలు రాసిన లేఖ మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది.

కుటుంబ సమస్యలను తీర్చేందుకు అర్జెంటుగా వెళ్లాల్సి ఉండటంతోనే వెళ్తున్నామని మళ్లీ 15 రోజుల్లో కుటుంబ సమస్యలను తీర్చే తిరిగి వస్తాను అంటూ లేఖలో పేర్కొన్నారు.తమకు భార్యలు కూడా జైలు శిక్ష అనుభవిస్తుండటంతో తమ పిల్లలు అనాధలుగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.

వారికీ అన్ని వసతులు కల్పించి మళ్లీ కోర్టులో వచ్చిన లొంగిపోతాం అంటు లేఖలో పేర్కొనడంతో ఇది చూసిన అధికారులు సైతం అవాక్కయ్యారు.వీరికి 2029 వరకు శిక్ష అనుభవించాల్సి ఉండగా ప్రస్తుతం జైలు నుంచి పారిపోయినందుకు మరో ఐదేళ్ళ శిక్ష అవకాశాలు ఉండగా.

అటు పోలీసు అధికారులు ఇద్దరు ఖైదీలను వెతికే పనిలో పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube