ఇస్మార్ట్ హీరో అనగానే వెంటనే గుర్తొచ్చే హీరో ఎవరో కాదు రామ్ పోతినేని.దేవదాసు సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్లి స్టార్ హోదా ను సంపాదించుకున్నాడు.ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఈయనకు గాయమైంది.
ప్రస్తుతం రామ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఫిక్స్ చేశాడు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా మరో సినిమాకు సిద్ధంగా ఉన్నాడు.
ఇక డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే పలు సినిమాలతో వరుసగా ఫ్లాప్స్ ఎదురుకోగా ఇప్పుడు మంచి సక్సెస్ కోసం కాస్త జాగ్రత్త పడుతున్నాడు.
ఇదిలా ఉంటే ఓ సినిమా కోసం తెగ వర్కవుట్లు చేస్తున్నాడు రామ్.సోమవారం తను జిమ్ చేస్తుండగా అతని మెడకు గాయం అయిందని తెలిసింది.నెక్ బ్యాండ్ తో ఉన్న ఓ ఫోటోను రామ్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.దీంతో ఈ ఫోటో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారగా డబుల్ ఎనర్జీ తో తిరిగి రావాలి అని కోరుకున్నారు అభిమానులు.
తనకు గాయం కావడంతో ప్రస్తుతం సినిమా షూటింగ్ కు వాయిదా పడినట్లు తెలుస్తుంది.