అర్జున్ టెండుల్కర్ కు గాయాలు.. ఐపిఎల్ లో కనిపించకపోవడానికి కారణం అదేనా..?!

ముంబై ఇండియన్స్ టీమ్ లో ఆల్‌రౌండర్ గా సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు.అయితే మ్యాచ్ లో ఇంత వరకూ ఆడలేదు.

 Injuries To Arjun Tendulkar What Is The Reason For Not Appearing In Ipl ..?! Sac-TeluguStop.com

ఈ తరుణంలో ప్రాక్టీస్ చేస్తుండగా గాయాలపాలయ్యాడు.గాయం అవ్వడం వల్ల ఐపీఎల్ 2021 రెండో దశకు పూర్తిగా దూరం అవ్వాల్సి వచ్చింది.

ప్రస్తుతం అర్జున్ టెండుల్కర్ కోలుకుంటున్నాడు.దీంతో అర్జున్ టెండుల్కర్ స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్‌ ను ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ తీసుకోబోతున్నట్లు తెలిపింది.

ముంబై ఇండియన్స్ టీమ్ లోకి సిమర్‌జీత్ సింగ్‌ ను అర్జున్ టెండుల్కర్ కు బదులుగా తీసుకుంటున్నట్లు ప్రకటనలో తెలిపింది.మిగిలిన ఐపీఎల్ 2021 మ్యాచ్‌ లకు సిమర్ జీత్ అర్జున్ టెండుల్కర్ కు బదులుగా అందుబాటులో ఉంటాడు.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులతో తలపడాల్సి ఉంటుంది.

ఈ సంవత్సరం మొదట్లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్‌ను ముంబై ఇండియన్స్ జట్టు రూ.20 లక్షల ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.గత సంవత్సరం ఐపీఎల్ లో ముంబై జట్టు నెట్ బౌలర్‌గా అర్జున్ టెండుల్కర్ యూఏఈకి వెళ్లాడు.

ఆ టైంలోనే అర్జున్ టెండుల్కర్ టాలెంట్ చూసిన కోచ్, సహాయక సిబ్బంది తనని జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.Telugu Arjun Tendulkar, Insure, Mumbai Indians, Tendulkar, Ups-Latest News - Tel

వేలానికి ముందు చూస్తే అర్జున్ టెండుల్కర్ తన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకున్నాడు.పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ క్రికెట్ టోర్నమెంట్‌ 2020-21లో జరిగింది.ఇందులో ఎంఐజీ క్రికెట్ క్లబ్ తరపున అర్జున్ టెండుల్కర్ ఆడి 3 వికెట్లు తీశాడు.

అంతేకాకుండా 31 బంతుల్లోనే 77 రన్స్ చేసి అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు.జూనియర్ స్థాయిలో కూడా ఆల్‌రౌండర్‌ గా అర్జున్ టెండుల్కర్‌ కు రికార్డులు బాగానే ఉండటంతో ముంబై జట్టు తనను ఎంపిక చేసుకుంది.

ప్రస్తుతం అర్జున్ టెండుల్కర్ గాయాలు వల్ల విశ్రాంతి తీసుకుంటున్నాడు.త్వరలోనే కోలుకుని మళ్లీ తన ప్రతిభను చూపేందుకు రానున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube