విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష...

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ను రక్షించుకుందాం అన్న టీవీ ప్రేమ్ జోగి బ్రదర్స్ కృష్ణంరాజు అన్నారు.ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి విచ్చేసి తన సంఘీభావాన్ని తెలియజేశారు.

 Initiation Of Hunger Strike Under The Auspices Of Visakhapatnam Steel Conservati-TeluguStop.com

ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ తో ప్రజలకు అవినాభావ సంబంధం ఉందని ఆయన అన్నారు.పార్టీలకతీతంగా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పోరాటం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఈ ప్రాంతం కళాకారులకు పుట్టినిల్లు అని వారితో సంప్రదించి వారి సహకారాన్ని కూడా ఈ పోరాటానికి అందించడానికి నా వంతు కృషిని కొనసాగిస్తానని ఆయన అన్నారు.ఈ కర్మాగారాన్ని మరింత అభివృద్ధి చేర్చడం ద్వారా మరింత మందికి ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వసించారు.

కనుక ఈ కర్మాగారం రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు జె అయోధ్య రామ్, ఎన్.రామారావు, విళ్ళ రామ్ మోహన్ కుమార్, కొమ్మినేని శ్రీనివాస్, డేవిడ్, నెల్లి అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు.ఈ పోరాటాన్ని గ్రామస్థాయిలో విస్తరించడానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని వారు వివరించారు.

అందులో భాగంగా 13వ తారీఖున విజయనగరం లోని రాజకీయ పక్షాలను, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున సదస్సును, సభలు నిర్వహిస్తున్నామని వారు వివరించారు.వీటిని జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త తన సహకారాన్ని అందించాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు యు రామస్వామి, జె రామకృష్ణ, ఏ వల్లి, కరణం సత్యారావు, వేణుగోపాల్, మురళి కృష్ణ తదితరులతోపాటు బ్లాస్ట్ ఫర్నేస్ విభాగం ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube