ప్రారంభమైన పోలీస్ ఉచిత శిక్షణ

సూర్యాపేట జిల్లా:జిల్లా పోలీసు అధ్వర్యంలో కానిస్టేబుల్,ఎస్ఐ ఉద్యోగాలకు సిద్ధమౌతున్న నిరుద్యోగ అభ్యర్థులను ఎంపిక పరీక్షల ద్వారా ఉచిత శిక్షణకు ఎంపిక చేసి,కాసరబాద గ్రామంలో ఉన్న డబుల్ బెడ్ రూం కాలనీ వద్ద శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇండోర్ తరగతులను శనివారం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ ప్రారంభించారు.

ఈ సంద్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు సేవలు అందించడానికి నిత్యం అందుబాటులో ఉండే పోలీసు శాఖ అనువైన మార్గమని అన్నారు.

శిక్షణ కోసం నిర్వహించిన శారీరక దేహదారుఢ్య పరీక్ష,ఎంపిక రాత పరీక్షల నందు ఉతిర్ణత సాధించి శిక్షణకు ఎంపికైన అభ్యర్ధులకు అభినందనలు,శుభాకంక్షలు తెలిపారు.అవకాశం సద్వినియోగం చేసుకుని కష్టపడి చదువుకోవాలన్నారు.

నిత్యం సాధన చేయాలని సూచించారు.శిక్షణకు 300 మందిని ఎంపిక చేసినట్లు ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమానికి 120 మంది అభ్యర్థులు హాజరైనారని,ఎంపికైన,ఎస్పీ కార్యాలయం నుండి సమచారం అందుకున్న అభ్యర్థులందరూ శిక్షణకు హాజరై అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.60 రోజుల పాటు ఇండోర్,అవుట్ డోర్ శిక్షణ ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో శిక్షణ నోడల్ అధికారి ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,ఎస్ఐ వీరన్న,ఇండోర్ ఫ్యాకల్టీ,అభ్యర్థులు హాజరైనారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్26, గురువారం 2024
Advertisement

Latest Suryapet News