అమానుషం.. ఒకేసారి గాల్లో కలిసిపోయిన 43 మంది కూలీల ప్రాణాలు..!  

తాజాగా మానవాళి భయపడే విధంగా తీవ్రవాదులు ఓ ఘాతుకానికి పాల్పడ్డారు.దీంతో ఏకంగా 43 మంది కూలీలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

TeluguStop.com - Inhumane Survivors Of 43 Workers Who Joined Gallo At Once

మంచి, మానవత్వం లాంటివి పూర్తిగా మరిచిపోయి వన్య జంతువుల కంటే దారుణంగా వ్యవహరించిన తీవ్రవాద చర్యలకు బతుకు జీవనం కోసం రేయింబవళ్లు కష్టజీవులుగా పనిచేసే కూలీల ప్రాణాలు కోల్పోయారు.పొలం పనులకు వెళ్లిన 43 మంది వ్యవసాయ కూలీలను అతి దారుణంగా తీవ్రవాదులు హతమార్చారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - అమానుషం.. ఒకేసారి గాల్లో కలిసిపోయిన 43 మంది కూలీల ప్రాణాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image

నైజీరియా దేశంలోని బోకో హోరం ప్రాంతంలో చోటు చేసుకుంది.

రైతులు పొలంలో పని చేసుకుంటుండగా అక్కడ పనిచేసే వారిని తీసుకువెళ్లి.ఆ తర్వాత వారి చేతులను వెనక్కి విరిచి, కట్టెలకు కట్టేసి ఆపై గొంతులు కోసి చంపేశారు తీవ్రవాదులు.

నైజీరియా దేశంలోని మైదుగురి నగర సమీపంలో ఈ సంఘటన సంభవించడంతో ఆ దేశంలో ప్రస్తుతం ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈ సంఘటనపై తాజాగా ఐక్యరాజ్యసమితి అత్యంత భయానక ఘటనగా పేర్కొంది.

ఈ ఘటనకు సంబంధించి బోకో హోరం తీవ్రవాదులు పాల్పడినట్లు వారు తెలిపారు.

ఉగ్రవాదుల చేతిలో హతమైన రైతులకు ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలను నిర్వహించింది.

అసాధారణ మారణ కాండలో హత్యకు గురైన 48 కూలీలతో పాటు మరో ఆరుగురు తీవ్ర గాయాలతో పడి ఉన్న వారిని కూడా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.చనిపోయిన కూలీలందరి కూడా నైజీరియాలోని ఓ ప్రాంతానికి చెందినవారు అదికూడా వెయ్యి కిలోమీటర్లు నుంచి పొట్టకూటికోసం ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ వారు వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారే.

స్థానికంగా ఓ రైతు పొలంలో పని చేయడానికి కాంట్రాక్ట్ పనిపై వారు అక్కడికి రాగా వారు పొలంలో పని చేస్తుండగా ఈ దారుణ సంఘటన జరిగింది.ఈ సంఘటనలో 10 మంది మహిళలు, 33 మంది మగవారు ఉన్నారు.

మరో ఆరుగురు తీవ్ర గాయాలతో చావు బతుకు మధ్యన ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

#BokoHaram #Nijiera #Farmers #43 Farmers #Kill 43 Farmers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Inhumane Survivors Of 43 Workers Who Joined Gallo At Once Related Telugu News,Photos/Pics,Images..