హెచ్ 1 బీ వీసా జారీలో కఠిన నిబంధనలు.. మాపై ఆ ఎఫెక్ట్ ఉండదు: ఇన్ఫోసిస్  

indian tech giant infosys about Trump\'s New Visa Rules, Infosys, Infosys CEO Praveen Rao, Indians, H1B Visa jobs, America, Trump Visa Restrictions - Telugu America, H1b Visa Jobs, Indian Tech Giant Infosys About Trump\\'s New Visa Rules, Indians, Infosys, Infosys Ceo Praveen Rao, Trump Visa Restrictions

అధ్యక్ష ఎన్నికల్లో స్థానికులను ప్రసన్నం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వీసాలపై నిబంధనలను కఠినతరం చేశారు.దేశానికి చట్టబద్దమైన వలసలను అరికట్టడం స్థానికీకరణ, అమెరికా ఉద్యోగులను రక్షించేందుకు ఆయన తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసారు.

TeluguStop.com - Infosys Trump New H1b Visa Rules

అయితే ఇది భారతీయ ఐటీ పరిశ్రమపై పెను ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వీసాల రెన్యువల్‌తో పాటు కొత్త వీసాల దరఖాస్తుకు ప్రస్తుతమున్న నిబంధనలను కఠినతరం చేస్తూ విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ అమెరికాలో స్థిరపడిన, స్థిరపడాలని భావిస్తున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ట్రంప్‌ పాలనా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని దాదాపు 2.8 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర నష్టం వాటిల్లనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అక్కడి కంపెనీలకు కన్సల్టెన్సీలుగా పనిచేస్తున్న భారతీయ ఐటీ కంపెనీలకు కూడా తాజా ఉత్తర్వుల వల్ల భారీ నష్టం జరగనుందని చెబుతున్నారు.ప్రస్తుతం ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారే కాక పలు యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఉపాధి అవకాశాలకు కూడా ఈ ఉత్తర్వులు గండి కొడతాయని అంటున్నారు.

అయితే దీని ప్రభావం తమపై ఉండదని చెబుతోంది భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.

TeluguStop.com - హెచ్ 1 బీ వీసా జారీలో కఠిన నిబంధనలు.. మాపై ఆ ఎఫెక్ట్ ఉండదు: ఇన్ఫోసిస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అమెరికాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి తాము గత మూడేళ్ళుగా నియామకాలు చేపట్టినట్లు ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు తెలిపారు.ఈ కాలంలో అమెరికాలో తాము 13 వేల మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు ప్రవీణ్ చెప్పారు.హెచ్1బీ షరతుల ప్రభావం… భారత్ కు చెందిన రెండో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్… సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.కాగా… 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభంతో పోలిస్తే 20 శాతానికి పైగా వృద్ధి సాధించింది.ఫలితాల సందర్భంగా ఉద్యోగాలు, హెచ్1బీ అంశాలపై ప్రవీణ్ రావు స్పందించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 16,500 మంది విద్యార్థులకు ఉద్యోగావకాకాశాలను కల్పించామని, వచ్చే ఏడాది కూడా 15వేల మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటామని చెప్పారు.

జూనియర్ ఉద్యోగులకు హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయకూడదని ఇన్ఫోసిస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ప్రధానంగా నాలుగేళ్ల కంటే తక్కువ అనుభవమున్న ఉద్యోగికి దరఖాస్తు చేయబోమని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.భారత్‌కు ఆఫ్‌షోర్ వర్కింగ్ కోసం అక్కడి క్లయింట్లతో చర్చిస్తున్నామని, జూనియర్ ఉద్యోగులు చేసే పనిని భారత్‌కు తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నామని వారు చెబుతున్నారు.

#Indians #InfosysCEO #America #H1B Visa Jobs #IndianTech

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Infosys Trump New H1b Visa Rules Related Telugu News,Photos/Pics,Images..