మంచి పని చేస్తున్న "ఇన్ఫోసిస్"

ప్రపంచ ఐటీ దిగ్గజాలలో ఇన్ఫోసిస్ ముందు వరసలో ముందంజులో ఉంటుంది అన్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఐటీలోనే కాదు, సోషియల్ సర్విస్ లో కూడా మేము సైతం అంటుంది ఇన్ఫోసిస్.

 Infosys Says “we Are With Pm”-TeluguStop.com

విషయం ఏమిటంటే భారత దేశంలోని వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా రూపొందించాలని ప్రధాని నరేంద్రమోడీ కలలు కంటూ ఉండగా.ఆ ప్రయత్నానికి తాము కూడా చేయూతనిస్తాం అంటుంది ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.

నిన్న ప్రధాని నరేంద్ర మోడితో సమావేశం అయిన తర్వాత ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా మాట్లాడుతూ భారత దేశాన్ని స్మార్ట్ గా రూపొందించడంలో తాము సాయం చేస్తామని, దాదాపుగా 1500కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది.ప్రధాని కలలు కంటున్న డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సైతం పాలుపంచుకుంటామని ఆయన తెలిపారు.

అంతేకాకుండా ప్రతిష్టాత్మకంగా వచ్చే ఏడాది నిర్వహించనున్న ఉజ్జయిని కుంభమేళా కోసం ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది.మేళాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగపడనుంది.

మైసూర్‌లో ఉన్న ఇన్ఫోసిస్‌ క్యాంపస్ ను మొట్టమొదటి స్మార్‌సిటీగా ప్రకటించాలని విశాల్ సిక్కా ప్రధానిని కోరారు.ఈ మేరకు తమ విజ్ఞప్తికి నరేంద్రమోడీ సానుకూలంగా స్పందించారని సిక్కా తెలిపారు.

ఏది ఏమైనా ప్రధాని ఆలోచనకు ఐటీ సైతం తోడైతే ఫలితం దానంతట అదే వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube