భారతీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ చేతికి అమెరికన్ సంస్థ: డీల్ విలువ ఎంతో తెలుసా..?

భారతీయ వ్యాపార సంస్థల పరిధి నానాటికి విస్తరిస్తోంది.నాణ్యతా ప్రమాణాలు, సేవలు, నిపుణులైన మానవ వనరుల సాయంతో మన సంస్థలు ప్రపంచస్థాయి వ్యవస్థలుగా రూపాంతరం చెందుతున్నాయి.

 Indian Tech Giant Infosys Acquires Us-based Kaleidoscope Innovation For $42 Mill-TeluguStop.com

ఇదే సమయంలో వివిధ దేశాల్లో ఉన్న పలు కంపెనీలను టెకోవర్ చేస్తూ సత్తా చాటుతున్నాయి.

తాజాగా భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కెలీడోస్పోప్ ఇన్నోవేషన్‌ను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.

ప్రొడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్ సేవలు అందించే ఈ సంస్థకు మంచి గుర్తింపు ఉంది.మైక్రోసర్జికల్ సాధనాలు, శస్త్రచికిత్సలో ఉపయోగించే సాధనాలను కెలీడోస్కోప్ రూపొందిస్తోంది.

2019 డిసెంబర్‌ 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో కెలీడోస్కోప్ ఆదాయం 20.6 మిలియన్ డాలర్లు.కాగా తమ అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ నోవా హోల్డింగ్స్ ద్వారా సుమారు 42 మిలియన్ డాలర్లను వెచ్చించి కెలీడోస్కోప్‌ను కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫీ పేర్కొంది. 2021 ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ఈ డీల్ పూర్తవుతుందని ఇన్ఫోసిస్ ప్రకటించింది.

ఇన్ఫోసిస్‌ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే ఆ ఘనత వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తిదే.పెద్దగా అనుభవం లేకపోయినా కొద్ది మంది వ్యక్తులు కలిసికట్టుగా ఒక అంతర్జాతీయ స్థాయి కంపెనీని ఎలా స్థాపించగలరనే విషయాన్నీ ఇన్ఫోసిస్‌ రుజువు చేసింది.

చిన్న కంపెనీగా 1993లో స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన ఇన్ఫోసిస్‌, భారత స్టాక్‌ మార్కెట్‌ను వ్యవస్థీకృతం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube