చిన్నారికి రియల్ హీరో సోనూసూద్ పేరు.. ఎందుకు పెట్టారంటే.?

ఏడాదిన్నర సమయంలో తన సేవా కార్యక్రమాల ద్వారా రియల్ హీరో సోనూసూద్ ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.సోనూసూద్ ను అభిమానించే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం.

 Infant Girl Of Rajasthan Return Home After Heart Treatment Arranged By Sonusood-TeluguStop.com

తాజాగా రాజస్థాన్ కు చెందిన చిన్నారి తల్లిదండ్రులు చిన్నారికి సోనూసూద్ పేరును పెట్టుకున్నారు.గతేడాది లాక్ డౌన్ నిబంధనలు అమలైనప్పటి నుంచి సోనూసూద్ కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఆదుకున్నారు.

ఎవరైనా కష్టాల్లో ఉన్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తే వీలైనంత వేగంగా ఆ సమస్య గురించి స్పందిస్తూ సోనూసూద్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు సాయం కోరినా సోనూసూద్ తక్షణమే సాయం చేస్తుండటం గమనార్హం.

 Infant Girl Of Rajasthan Return Home After Heart Treatment Arranged By Sonusood-చిన్నారికి రియల్ హీరో సోనూసూద్ పేరు.. ఎందుకు పెట్టారంటే.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజస్థాన్ కు చెందిన చిన్నారి గుండె సంబంధిత సమస్యలతో బాధ పడగా ఆ చిన్నారి తల్లిదండ్రులు సోనూసూద్ సాయం కోరారు.

విషయం తెలిసిన వెంటనే సోనూసూద్ పాప సర్జరీకి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయించారు.చిన్నారి తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా చిన్నారి తల్లిదండ్రులు ఆ పాపకు సోనూ అని నామకరణం చేశారు.పాప డిశ్చార్జ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

సోనూసూద్ చేసిన సాయాలను చూసి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు.

సోనూసూద్ ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేకుండా ఎంతోమందికి సహాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.సోనూసూద్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సేవా కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తున్నారు.ఈ కార్యక్రమాల ద్వారా సోనూసూద్ ఎంతోమంది హృదయాలను గెలుచుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో కూడా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం.మరోవైపు రియల్ హీరో సోనూసూద్ కు సినిమా ఆఫర్లు కూడ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

#Sonu Name #Heart Surgery #Real Hero #Rajasthan Baby #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు