“హ్యాపీ డేస్ “అంటూ.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో “కొత్త బంగారులోకం” చూపించిన హీరో వరుణ్ సందేశ్ మొదటి సినిమాలు విజయవంతం కావడంతో ఆ తర్వాత పలు అవకాశాలను దక్కించుకున్నారు.
అయితే ఆ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ కు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయని చెప్పవచ్చు.
ఈ విధంగా అవకాశాలు రాని సమయంలో వరుణ్ సందేశ్ కు బిగ్ బాస్ ఆఫర్ రావడం నిజంగా ఒక బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్ళిన వరుణ్ సందేశ్ బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్ సంపాదించుకుంది మరి ఇండస్ట్రీలో అవకాశాలను అంది పుచ్చుకుంటున్నారు.
ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ హీరోగా, ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా మాధవి ఆదుర్తి నిర్మాణంలో, ఎంఎస్ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఇందువదన“.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకేంద్రుడు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా.వైవిధ్యమైన కథతో తెరకెక్కిన చిత్రం ఇందువదన.తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాలను చూడాలనే కోరిక మా తాతయ్యకు ఉండేది.
అయితే ఆ కోరిక తీరకుండానే తన తాతయ్య మరణించారని వరుణ్ సందేశ్ తెలిపారు.ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని తాజాగా సినిమా నుంచి విడుదలైన తొలి పాట యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకుందని ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ తెలియజేశారు.