తాతయ్య నా సినిమా చూడాలనుకున్నారు కానీ అంటూ వరుణ్ సందేశ్ ఎమోషనల్!

హ్యాపీ డేస్ “అంటూ.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో “కొత్త బంగారులోకం” చూపించిన హీరో వరుణ్ సందేశ్ మొదటి సినిమాలు విజయవంతం కావడంతో ఆ తర్వాత పలు అవకాశాలను దక్కించుకున్నారు.

 Induvadana Teaser Out Varun Sandesh Emotional-TeluguStop.com

అయితే ఆ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ కు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయని చెప్పవచ్చు.

ఈ విధంగా అవకాశాలు రాని సమయంలో వరుణ్ సందేశ్ కు బిగ్ బాస్ ఆఫర్ రావడం నిజంగా ఒక బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.

 Induvadana Teaser Out Varun Sandesh Emotional-తాతయ్య నా సినిమా చూడాలనుకున్నారు కానీ అంటూ వరుణ్ సందేశ్ ఎమోషనల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్ళిన వరుణ్ సందేశ్ బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్ సంపాదించుకుంది మరి ఇండస్ట్రీలో అవకాశాలను అంది పుచ్చుకుంటున్నారు.

ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ హీరోగా, ఫర్నాజ్‌ శెట్టి హీరోయిన్ గా మాధవి ఆదుర్తి నిర్మాణంలో, ఎంఎస్‌ఆర్‌  దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఇందువదన“.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకేంద్రుడు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా.వైవిధ్యమైన కథతో తెరకెక్కిన చిత్రం ఇందువదన.తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

Telugu Induvadana, Induvadana Teaser Out, K Raghavendra Rao, Tollywood, Varun Sandesh, Varun Sandesh Emotional, Varun Sandesh Grand Father-Movie

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాలను చూడాలనే కోరిక మా తాతయ్యకు ఉండేది.

అయితే ఆ కోరిక తీరకుండానే తన తాతయ్య మరణించారని వరుణ్ సందేశ్ తెలిపారు.ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని తాజాగా సినిమా నుంచి విడుదలైన తొలి పాట యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకుందని ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ తెలియజేశారు.

#VarunSandesh #Induvadana #VarunSandesh #Varun Sandesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు