జబర్దస్త్ షోకు జడ్జిగా కొంత కాలమే చేసినా ఇంద్రజ సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ఆమె నవ్వును అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.
రోజా సర్జరీల వల్ల జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు హాజరు కాకపోవడంతో ఆమెకు బదులుగా ఇంద్రజ షోకు వచ్చారు.వచ్చే వారం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలు రిలీజ్ కాగా జబర్దస్త్ షోకు రోజా హాజరైతే ఎక్స్ట్రా జబర్దస్త్ కు ఇంద్రజ హాజరయ్యారు.తాజాగా సుడిగాలి సుధీర్ ముద్దొస్తున్నాడంటూ ఇంద్రజ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.రామ్ ప్రసాద్, హైపర్ ఆది షోలోకి ఎంట్రీ ఇవ్వగా హైపర్ ఆది రామ్ ప్రసాద్ తో మా తాతకు కత్రినా వచ్చింది అని చెబుతాడు.
రామ్ ప్రసాద్ వెంటనే అది కత్రినా కాదని కరోనా అని చెప్పగా లేదు కత్రినానే వచ్చిందని కలలో కత్రినా ముద్దు పెడితే తాత షాకై చచ్చిపోయాడని ఆది అంటారు.
ఆ తరువాత సుధీర్ వెరైటీ గెటప్ లో షోలోకి ఎంట్రీ ఇస్తారు.రామ్ ప్రసాద్ నీ పేరు ఏంటి.? అని సుధీర్ ను అడగగా ఆంటీ సార్ అని సుధీర్ బదులిస్తాడు.హైపర్ ఆది వెంటనే మాకు తెలిసిన ఆంటీయా.? నీకు తెలిసిన ఆంటీయా.? అంటూ పంచ్ వేస్తారు.ఆ తరువాత మా ఆంటీ తనకు ఆంటీ అని పేరు పెట్టిందని సుధీర్ చెబుతాడు.
ఆ తరువాత ఆంటీ పేరేంటని రామ్ ప్రసాద్ అడగగా ఆంటీ పేరు అంకుల్ అని అంకుల్ పేరు పిన్ని అని సుధీర్ చెబుతాడు.
సుధీర్ వేసిన పంచ్ లకు జడ్జీలు ఇంద్రజ, మనో పడీపడీ నవ్వారు.
సుధీర్ మేకప్ ను చూసి ఇంద్రజ ఆ అబ్బాయి మేకప్ లో ఎంత ముద్దొచ్చాడో అని కామెంట్లు చేశారు.ఇంద్రజ ప్రశంసించడంతో సుడిగాలి సుధీర్ స్మైల్ ఇచ్చారు.
సుధీర్ గెటప్ ను చూసి రష్మీ షాకవ్వడంతో పాటు పడిపడి నవ్వారు.