వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు( America ) వలస వెళ్లిన భారతీయులు అక్కడ అత్యున్నత స్థానంలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.పురుషులతో పాటు మహిళలు కూడా తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు.
గత కొన్ని దశాబ్ధాలుగా భారతీయ మహిళలు ఎఫ్ఎంసీజీ, సాయుధ దళాలు, ఐటీ, బ్యాంకింగ్ రంగాలలోకి పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నారు.తాజాగా అమెరికాలోని 100 మంది ధనవంతులైన సెల్ఫ్‌మేడ్ మహిళలతో ఫోర్బ్స్( Forbes ) ప్రకటించిన జాబితాలో నలుగురు భారత సంతతికి చెందిన మహిళలు జయశ్రీ ఉల్లాల్, ఇంద్రా నూయి తదితరులు చోటు సంపాదించారు.వీరందరి నికర సంపద విలువ రూ.4.06 బిలియన్ డాలర్లు.
కంప్యూటర్ నెట్‌వర్కింగ్ సంస్థ అయిన అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్ .( Jayshree Ullal ) ఐటీ కన్సల్టింగ్ అండ్ ఔట్ సోర్సింగ్ సంస్థ Synte సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ…( Neerja Sethi ) క్లౌడ్ కంపెనీ కాన్‌ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు , మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నేహా నార్ఖెడే …( Neha Narkhede ) పెప్సికో మాజీ చైర్, సీఈవో ఇంద్రా నూయిలు( Indra Nooyi ) ఈ జాబితాలో చోటు సంపాదించారు.ఈ జాబితాలో 15వ స్థానంలో వున్న ఉల్లాల్ నికర విలువ 2.4 బిలియన్ డాలర్లు.ఆమె 2008 నుంచి అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
లండన్‌లో పుట్టి భారత్ లో పెరిగిన ఉల్లాల్.కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్ లో చదువుకున్నారు.
శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, శాంటా క్లారా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ పట్టా పొందారు.ఆమె నాయకత్వంలో కంపెనీ జూన్ 2014లో ఐపీవోకి వెళ్లింది.
ఇక ఈ జాబితాలో 25వ స్థానంలో వున్న 68 ఏళ్ల సేథి నికర విలువ 990 మిలియన్ డాలర్లు. 1980లో సేథీ, భర్త భరత్ దేశాయ్ కలిసి స్థాపించిన Synteను ఫ్రెంచ్ ఐటీ సంస్థ ఆటోస్ ఎస్ఈ అక్టోబర్ 2018లో 3.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.సేథి తన వాటా కింద 510 మిలియన డాలర్లను పొందినట్లుగా అంచనా.
ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ, మాస్టర్స్ చేసిన సేథి.ఓక్లాండ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు.
38 ఏళ్ల నార్ఖేడ్ 520 మిలియన్ డాలర్ల నికర సంపదతో జాబితాలో 50వ స్థానంలో నిలిచారు.కాన్‌ఫ్లూయెంట్ 2021 జూన్‌లో 9.1 బిలియన్ వాల్యుయేషన్‌తో పబ్లిక్ కంపెనీగా లిస్ట్ అయ్యింది.తద్వారా నార్ఖేడ్‌కు దాదాపు 6 శాతం వాటా దక్కుతుందని ఫోర్బ్స్ పేర్కొంది.
ఇక ఇంద్రా నూయి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పెప్సికో మాజీ చైర్, సీఈవోగా పనిచేసిన ఆమె.ఆ కంపెనీలో 24 ఏళ్ల పాటు పనిచేసి 2019లో పదవీ విరమణ చేశారు.67 ఏళ్ల ఇంద్రా నూయి 350 మిలియన్ డాలర్ల నికర సంపదతో ఫోర్బ్స్ జాబితాలో 77వ స్థానంలో నిలిచారు.పెప్సికోలో పనిచేస్తుండగా ఆమెకు కంపెనీ ఇచ్చిన స్టాక్స్ కారణంగా ఇంద్రా నూయి సంపద పెరిగింది.