ఈ మెగాస్టార్ చిరంజీవి అక్కని గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించిన “ఇంద్ర” చిత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటుంది.

 Actress Vinaya Prasad Real Life News,vinaya Prasad, Telugu Actress, Indra Movie-TeluguStop.com

 అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి అక్క పాత్రలో నటించిన కన్నడ నటి  మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వినయ ప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఒకప్పుడు కన్నడలో వినయ హీరోయిన్ గా కూడా నటించింది.

 కానీ ఈమె నటించిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోలేక పోయింది.

దీనికితోడు పలు వ్యక్తిగత కారణాల వల్ల కొంత కాలం పాటు వినయ సినీ పరిశ్రమకు దూరం అయింది.

దీంతో ఒకానొక సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా నటించడానికి సిద్ధమైంది.ఇందులో భాగంగా పలు టాలీవుడ్ చిత్రాలలో అమ్మ, అక్క, చెల్లి, వదిన, తదితర పాత్రలలో నటించే అవకాశాలు దక్కించుకుంది.

ఇక నటి వినయ ప్రసాద్ వ్యక్తిగత జీవితానికి వస్తే  ఈమె కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో పుట్టి పెరిగింది.కాగా ఈమె 1988 వ సంవత్సరంలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు వి.

ఆర్.కే ప్రసాద్ ని పెళ్లి చేసుకుంది.

అయితే పెళ్లైన ఏడు సంవత్సరాలకే పలు ఆరోగ్య సమస్యల కారణంగా వి.ఆర్.కే ప్రసాద్ మరణించడంతో 2002వ సంవత్సరంలో జ్యోతి ప్రకాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.కాగా ప్రస్తుతం వినయ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.

అయితే తెలుగులో నటి వినయ ప్రసాద్ చివరగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి “సరైనోడు” చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆమె తెలుగులో నటించలేదు.

వినయ ప్రసాద్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తులు, తదితర భాషలలో దాదాపుగా 100 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కాగా ఇందులో ఆమె మాతృభాష కన్నడ కావడంతో ఎక్కువ శాతం చిత్రాలు కన్నడ భాషలోనే నటించింది.

అలాగే మలయాళం, కన్నడ భాషల్లో దాదాపుగా 18 కి పైగా సీరియల్స్ లో నటించింది.దీంతో నటి వినయ ప్రసాద్ ఇటు బుల్లితెర ప్రేక్షకులను అటు వెండితెర ప్రేక్షకులను తన నటనతో బాగానే మెప్పించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube