సూపర్ ఐడియా.. ఆవుపేడతో రాఖీలు,వినాయక విగ్రహాలు తయారీ!

కరోనా వైరస్ కాలంలో ఎంతోమంది ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.దీంతో ఇంట్లోనే ఉండే ఎంతోమంది మహిళలు చిన్న చిన్న పనులు చేసి ఆర్ధికంగా సహాయం చేస్తున్నారు.

 Indore Woman,  Eco Friendly Rakhis,  Cow Dung,  Madhya Pradesh, Indore Woman Cow-TeluguStop.com

ఇంకా ఈ నేపథ్యంలోనే కొందరు మహిళలు ఆవు పేడతో పర్యావరణ రాఖీల తయారీ చేసి వాటిని విక్రయిస్తూ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.

వచ్చే నెల ఆగస్టు 3న రక్షా బంధన్ సందర్భంగా ఆవుపేడతో రాఖీల తయారీకి ఇండోర్ మహిళ శ్రీకారం చుట్టారు.

ఇండోర్ నగరానికి చెందిన శ్వేతా పలివాల్ అనే మహిళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మనిర్భార్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆవుపేడతో రాఖీలను తయారు చేశారు.
అయితే ఇండియా-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్థత కారణంగా చైనా వస్తువులను బహిష్కరించిన సంగతి తెలిసిందే.

ఇంకా ఈ నేపథ్యంలోనే శ్వేతా స్వదేశీ వస్తువుల తయారీని ప్రారంభించింది.కేవలం రాఖీలు మాత్రమే కాదు వినాయకచవితికి కూడా ఆవు పేడతో వినాయక విగ్రహాలను తయారు చేశారు.

Telugu Cow Dung, Ecofriendly, Indore, Indorecow, Madhya Pradesh-Latest News - Te

అవి మాత్రమే కాదు కాటన్ వస్త్రాలతో వివిధ రకాల డిజైన్లతో ఫేస్ మాస్కులు సైతం శ్వేతా తయారు చేశారు.ఆమె మాత్రమే కాకుండా మిగితా మహిళలకు నేర్పుతు సహాయం చేస్తుంది.ఇంకా ఇంటికి సంబందించిన డెకరేషన్ ఆర్టికల్స్ ను కూడా తయారుచేసి వాటికి చక్కటి రంగులతో అద్బుతమైన పెయింటింగులు వేసి ఇంటిని అందంగా తయారు చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube