మాస్కు ధ‌రించ‌లేద‌ని దారుణంగా ప్రవర్తించిన పోలీసులు.. ఇంత ఘోరమా..

దేశంలో కరోనా తీవ్రంగా వింజృభిస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ప్రజలంతా కరోనా నిబంధలను తప్పని సరిగా పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

 Indore Police Beaten A Person For Not Wearing A Mask-TeluguStop.com

ఒకవేళ ఇలా చేయని వారికి జరిమానాలు విధిస్తున్నాయి.అదీగాక భయపెట్టో, బ్రతిమిలాడో మొత్తానికి ప్రజలకు కరోనా రక్షణ చర్యలు నేర్పిస్తున్నాయి.

ఇంతవరకు బాగానే ఉన్నా మాస్కు దరించకుంటే దండించే పోలీసులను ఎప్పుడైనా చూశారా.లేదా అయితే చూడండి.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ సిటీలో ఓ వ్య‌క్తి మాస్కు స‌రిగా ధ‌రించ‌లేద‌ని అత‌న్ని పోలీసులు దారుణంగా చిత‌క‌బాదిన ఘటన మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుందట.

 Indore Police Beaten A Person For Not Wearing A Mask-మాస్కు ధ‌రించ‌లేద‌ని దారుణంగా ప్రవర్తించిన పోలీసులు.. ఇంత ఘోరమా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హాస్పిట‌ల్లో ఉన్న తన తండ్రి కోసం భోజ‌నం తీసుకెళ్లే హడావుడిలో పడిన 35 ఏండ్ల వ‌య‌సున్న ఓ వ్య‌క్తి మాస్కు ధరించడం మరచిపోయాడట.

స‌రిగా అదే సమయంలో మాస్కు ధ‌రించ‌లేద‌ని పోలీసులు అత‌న్ని ఆపి రోడ్డుపై ప‌డేసి తీవ్రంగా కొడుతూ, త‌ల‌పై కాలు పెట్టి తొక్కుతూ దారుణంగా ప్రవర్తించారట.

కాగా ఆ వ్య‌క్తి బంధువులు ఎంతగా వేడుకున్న‌ప్ప‌టికీ పోలీసులు క‌నిక‌రించ‌లేదు.

అయితే అదే సమయంలో ఈ దారుణాన్న దృశ్యాల‌ను అక్క‌డున్న కొంద‌రు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయడంతో, విషయం కాస్త ఉన్న‌తాధికారుల దృష్టికి వెళ్లిందట.వెంటనే స్పందించిన అధికారులు ఆ వ్య‌క్తిని కొట్టిన ఇద్ద‌రు పోలీసుల‌ను స‌స్పెండ్ చేసినట్లుగా సమాచారం.

#Indore City #Madhya Pradesh #Police #Wearing A Mask #Misbehaved

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు