ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిన బాలుడు... ఎందుకో తెలుసా...?

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్న అది ప్రపంచం మొత్తం సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుస్తుంది.ఈ సోషల్ మీడియా ద్వారా సామాన్యుడిగా ఉన్నవారిని కూడా హీరోగా చేస్తుంది.

 Boy, Eggs, Prime Minister, Municipal Corporation Workers, Eggs Broke , Mp Digvij-TeluguStop.com

అయితే తాజాగా మధ్యప్రదేశ్ లో కోడిగుడ్లు పగిలిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఒక బాలుడు రాత్రికి రాత్రే ఒక స్టార్ గా మారాడు.దీనితో అతని జీవితమే పూర్తిగా మారిపోయింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే….మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తన తల్లిదండ్రులతో కలిపి 13 సంవత్సరాల బాలుడు పరాస్ తన కుటుంబానికి అండగా నిలిచేందుకు, తోపుడు బండి మీద కోడిగుడ్లను అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించేవాడు.

ఇలా సుమారు 7 వేల రూపాయలు విలువచేసే కోడిగుడ్లను తోపుడు బండి మీద అమ్ముకుంటూ ఉండగా రోడ్డు మీద ఒక పక్కకు ఆపుకొని… మూత్రం పోయడానికి కాస్త పక్కకు వెళ్ళాడు.ఇంతలోనే మున్సిపల్ అధికారులు వచ్చి ఆ బాలుడి పై ఆగ్రహం వ్యక్తం చేసి తోపుడు బండి మీద ఉన్న కోడిగుడ్లు కొన్నిటిని నేలపాలు చేశారు.అంతేకాకుండా ఆ బాలుడి కి రోడ్డుమీద తోపుడు బండి నిలపడంతో రూ.100 జరిమానా కూడా విధించారు.ఇక దీనితో ఆ బాలుడు కణితి పర్యంతం అయ్యాడు.

7000 విలువచేసే కోడి గుడ్లు అన్నీ పగలడంతో రోడ్డుమీద ఏడుస్తూ కూర్చున్నాడు.ఈ సంఘటన గమనించిన అక్కడి స్థానికులు అందరూ కూడా ఆ సంఘటనని ఫోన్ లో రికార్డు చేసి సామాజిక మాధ్యమం లో పోస్ట్ చేశారు.దీనితో మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు, అందులో కొందరు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

ఈ తరుణంలో సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా ఆ పిల్లవాడికి 15 రూపాయలు సహాయం చేయడంతో పాటు ఆ పిల్లల చదువులకు మొత్తం కూడా చూసుకుంటానని తెలియజేశాడు.

ఈ వీడియో చూసి బీజేపీ ఎమ్మెల్యే కూడా స్పందించి ఆ బాలుడికి ఏకంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఒక ఇంటిని కూడా ఇవ్వడం జరిగింది .దాంతోపాటు ఆ బాలుడికి 2500 రూపాయలు నగదు, ఒక సైకిల్ కూడా సహాయం అందజేశారు.ఈ విధంగా ఆ బాలుడి కష్టం జీవితం ఒక్కసారిగా మారిపోయాయి, చదువుకోవడానికి అవసరమైన అవకాశంతో పాటు ఉండడానికి ఇల్లు కూడా లభించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube