ఇదెక్కడి విచిత్రం.. ఆ మహిళకు గాలి ద్వారా బిడ్డ పుట్టిందట..

కొన్ని వార్తలు వింటే ఆశ్చర్యం కలగక మానదు.ఎందుకంటే ఆ వార్తలు అంత విచిత్రంగా ఉంటాయి.

 Indonesian Woman Claims Gust Of Wind Made Her Pregnant, Indonesia, Woman, Viral-TeluguStop.com

వింటే నవ్వు తెప్పిస్తాయి.కొన్ని అయితే అసలు మనం నమ్మం కూడా.

ఇప్పుడు కూడా మనం అలంటి విచిత్రమైన వార్తనే తెలుసుకోబోతున్నాం.

ఒక మహిళ తాను గాలి ద్వారా గర్భం పొంది బిడ్డను కన్నానని షాకింగ్ న్యూస్ చెప్పింది.

ఆమె మాటలు చాలా విచిత్రంగా అనిపించాయి.ఆమె మీడియాతో మాట్లాడుతూ.

నేను నిద్రిస్తున్న సమయంలో నా జననేంద్రియాలను తాకుతూ గాలి వీచింది.ఆ తర్వాత నాకు కడుపు నొప్పి వచ్చింది.

ఒక గంటకే నాకు బిడ్డ పుట్టింది.అని చెప్పుకొచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఇండోనేషియాకు చెందిన 25 సంవత్సరాల సితి జైనా అనే మహిళ తాను గర్భవతి అని తెలిసిన గంటకే నాకు బిడ్డ పుట్టిందని స్థానిక మీడియాకు తెలిపింది.ఆమె మాట్లాడుతూ.

నేను పడుకుని నిద్రపోతున్న సమయంలో పెద్దగా గాలి వీచింది.ఆ గాలి నా జననేంద్రియాల ద్వారా లోపలి పోయింది.

తర్వాత కొద్దిసేపటికే కడుపులో నొప్పి వచ్చింది.అది వేగంగా కడుపులో పెరిగిపోయింది.

Telugu Indonesia, Pregnant-Latest News - Telugu

కడుపు నొప్పితో స్థానిక ఆసుపత్రిలో చేరాను.డాక్టర్లు పరీక్షలు చేసి గర్భం వచ్చిందని చెప్పారు.వాళ్ళు చెప్పిన గంటలోనే బిడ్డ పుట్టిందని తెలిపింది.దీని గురించి డాక్టర్ మాట్లాడుతూ.ఆమెకు రహస్య గర్భం ఏర్పడింది.దీంతో ఈ విషయం ఆమె తెలుసుకోలేకపోయింది.

ఈ విధంగా రహస్య ప్రెగ్నెన్సీ వచ్చే మహిళలకు కడుపు ఎత్తుగా ఉండదు.వారు తెలియకుండానే బిడ్డను కనిస్తుంటారు.

ఈ వార్త మీడియాలో రావడంతో క్షణాల్లోనే వైరల్ అయ్యింది.గాలి వల్ల బిడ్డ పుట్టిందని వార్త ఈ విషయం నమ్మేలా లేదని డాక్టర్లు చెబుతున్నారు.ఈ వార్త విపరీతంగా వైరల్ అవ్వడంతో ప్రజలు కూడా ఈ విషయాన్ని నిజమని నమ్ముతున్నారు.అందుకే పోలీసులు రంగంలోకి దిగి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటామని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube