ఆమె మ‌తిమ‌రుపుతో ల‌క్షాధికారి అయింది.. ఎలాగో తెలిస్తే..

జనరల్‌గా మతి మరుపు వలన ఎవరైనా నష్టపోతుంటారు.ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Indonesian Woman Became A Millionaire With Forgetfulness If You Know How Details-TeluguStop.com

ఎవరైనా సరే ఈ మతి మరుపు గురించి కోప్పడుతుంటారు కూడా.కానీ, ఈ మహిళ విషయంలో అలా జరగలేదండోయ్.

మతి మరుపు వల్లే ఈ మహిళ లక్షాధికారి అయింది.ఎలాగో తెలియాలంటే మీరు ఈ స్టోరి చదవాల్సిందే.

ఇండోనేషియా కంట్రీకి చెందిన సిండి ప్రసేత్య అనే ఉమన్ కొన్నాళ్ల కిందట బ్యాంకులో రూ.5 లక్షలు డిపాజిట్ చేసింది.అయితే, ఈ విషయం ఆమె మరిచిపోయింది.ఇక ఇటీవల కాలంలో ఆమె వద్ద డబ్బులేక తీవ్రమైన ఇబ్బందులు పడుతోంది.ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి చాలా దుర్భరమైన జీవితాన్ని ఆమె గడుపుతోంది.ఈ క్రమంలోనే ఆమెకు తాజగా వచ్చిన ఓ ఫోన్ కాల్ ఆమెను లక్షాధికారి చేసింది.బ్యాంకు వారు ఫోన్ చేసి మీ అకౌంట్‌లో రూ.35 లక్షలు ఉన్నాయని తెలపడంతో ఆమె ఆశ్చర్యపోయింది.

తనకు అంత డబ్బు వచ్చిందని ఆమె ఆశ్చర్యపోయింది.ఈ విషయమై ఆమె మళ్లీ ఒకసారి గతం గుర్తుకు తెచ్చుకోగా, అప్పట్లో అకౌంట్‌లో వేసిన రూ.5 లక్షలు జ్ఞాపకం వచ్చింది.

Telugu Rupees, Bank, Cindy, Forgot, Indonesia, Millionaire-Latest News - Telugu

అలా ఆనాడు వేసిన డబ్బులకు వడ్డీ పెరుగుతూ పెరుగుతూ ప్రస్తుతం రూ.35 లక్షలు అయిందన్న సంగతి తెలుసుకుని ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది.తీవ్రమైన ఆర్థిక భారంతో బాధపడుతున్న తనకు మతి మరుపు వల్ల మళ్లీ జీవితాన్ని ఆస్వాదించే క్షణాలు ఎదురయ్యాయని ఈ సందర్భంగా తెలిపింది.

ఇక సిండి బ్యాంకు అకౌంట్‌లో ఉన్న డబ్బులు తీసుకునేందుకుగాను ఏళ్ల తర్వాత బ్యాంకుకు వెళ్లినట్లు తెలుస్తోంది.అలా ఆ బ్యాంకు వారు ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.

 అదేంటో మీరు కూడా తెలుసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube