ఇలాంటి తల్లి ఇండియాలో ఉంటే కొట్టి చంపేస్తారు... పిల్లాడిని ఏం చేసిందో తెలిస్తే కోపం ఆపుకోలేరు  

Indonesia Mother Gives Beer To Her Child For Good Sleep-telugu Viral News Updates,viral In Social Media,కొడుకును నిద్ర పుచ్చేందుకు

చిన్న పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిపై ఉంటుంది. ఇతరులు పిల్లలను ఎలా చూసుకున్నా కూడా తల్లి మాత్రం తన ప్రాణంకు ప్రాణంగా చూసుకోవాలి. చిన్న పిల్లలను ఎవరు ఎలా చూసినా కూడా తల్లి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి..

ఇలాంటి తల్లి ఇండియాలో ఉంటే కొట్టి చంపేస్తారు... పిల్లాడిని ఏం చేసిందో తెలిస్తే కోపం ఆపుకోలేరు-Indonesia Mother Gives Beer To Her Child For Good Sleep

ముఖ్యంగా అయిదు సంవత్సరాల వరకు పిల్లలను ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాని ఇండోనేషియాకు చెందిన ఒక తల్లి అత్యంత దారుణంగా ప్రవర్తించింది. ఆమె వ్యవహరించిన తీరు అత్యంత వివాదాస్పదం అయ్యింది.

నీచమైన ఆమె బుద్దికి తగిన గుణపాఠం చెప్పాలని నెటిజన్స్‌ అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఇండోనేషియాకు చెందిన ఒక మహిళ తన ఏడాది వయసు ఉన్న కొడుకును నిద్ర పుచ్చేందుకు చాలా ప్రయత్నించింది. కాని ఆ పిల్లాడు మాత్రం ఎంతుకు నిద్ర పోకుండా ఏడుస్తూ, ఆడుతూ ఉన్నాడు. అప్పటికే రాత్రి చాలా టైం అయ్యింది.

అయినా ఆ పిల్లాడు నిద్ర పోకపోవడంతో ఆమెకు విసుగు వచ్చింది. తాను పడుకున్నా కూడా చిరాకు పెడుతున్నాడు. ఇంట్లో అంతా పడుకున్నా అతడు మాత్రం పడుకోక పోవడంతో ఆమెకు కోపం వచ్చింది.

ఏం చేయాలని ఆలోచించి చివరకు అతడికి బీర్‌ తాపించాలని భావించింది. బీర్‌ తాగితే నిద్ర వస్తుందని ఆమె అనుకుంది. బీర్‌ ను తీసుకుని అతడికి తాపించింది.

ఆ తర్వాత కొద్ది సేపటికి అతడు పడుకున్నాడు. ఇదంతా ఆమె వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఆ మహిళ చేసిన పోస్ట్‌ విపరీతంగా వైరల్‌ అయ్యింది. చిన్న పిల్లాడికి బీర్‌ తాపించడం ఏంటీ అంటూ తీవ్ర స్థాయిలో నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమెను వెంటనే అరెస్ట్‌ చేయాలని స్థానికులు సైతం డిమాండ్‌ చేస్తున్నారు. ఒక వేళ ఇదే సంఘటన ఇండియాలో జరిగి ఉంటే మాత్రం ఆమెను కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా స్థానికులు సైతం పెద్ద ఎత్తున ఇష్టం వచ్చినట్లుగా కొట్టి చంపేవారు. కాని ఇండో నేషియాలో మాత్రం ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు..

అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఆమె అసలు బీర్‌ తాపించిందా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నారు.

పిల్లలకు బీర్‌ తాపడం వల్ల వారు నిద్ర పోతారు అనుకోవడం పిచ్చి పొరపాటు అని, అంత చిన్న వయసులో బీర్‌ను తాపించడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు పిల్లలకు వస్తాయని వైధ్యులు అంటున్నారు. అత్యంత దారుణంకు ఒడిగట్టిన ఆమెను కఠినంగా శిక్షించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.