గాల్వన్ వ్యాలీ వద్ద ఇండో-చైనా దళాల మధ్య ఘర్షణ,ముగ్గురు జవాన్లు మృతి

లడఖ్‌లోని గాల్వన్‌ వ్యాలీ వద్ద చైనా సైన్యం, భారతీయ సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది.ఈ ఘర్షణలో భారత్‌కు చెందిన ఒక సైనికాధికారి, ఇద్దరు జవాన్లు మృతి చెందగా,చైనా సైనికులు కూడా చనిపోయినట్లు భారత్‌ ఆర్మీ అధికారులు చెబుతున్నారు.

 Indo-china Conflict, Army Officer, Two Jawans, Killed-TeluguStop.com

గాల్వన్‌ వ్యాలీలో ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కొనసాగుతున్న తరుణంలో రెండు సైన్యాల మధ్య సోమవారం రాత్రి పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది.ఇరు వర్గాల సైనికులూ చనిపోయారు.

భారత్‌ వైపునుండి ఒక అధికారి, ఇద్దరు జవాన్లు చనిపోయారు.ఘర్షణలో తుపాకులు వాడలేదని, ఎటువంటి కాల్పులు జరపలేదని, రాళ్లు, లాఠీలతో ఇరు వర్గాలూ హింసాత్మకంగా కొట్టుకున్నారని, ఆ దెబ్బల కారణంగానే సైనికులు మరణించారని భారత ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.ఇరు సైన్యాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరువైపుల నుండి మేజర్‌ జనరల్స్‌ సమావేశమయ్యారు.1975 తర్వాత హింసాత్మక ఘటనలు జరిగి సైనికులు చనిపోవడం 1975 తర్వాత ఇదే మొదటిసారి.1962లో భారత్‌,చైనా మధ్య సరిహద్దు యుద్దం జరిగిన సంగతి తెలిసిందే.ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు వర్గాలకు చెందిన ఆర్మీ ఉన్నతాధికారులు గాల్వన్‌ వ్యాలీ వద్ద సమావేశమయ్యారు అని భారత్‌ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సిడిఎస్‌) బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాధిపతులు, విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు.పరిస్థితిపై చర్చించారు.

మరోపక్క భారత సైనికులే చట్టవిరుద్దంగా చైనా భూబాగంలోకి చొరబడి తమ సైనికులపై దాడి చేశారని, దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని చైనా విదేశాంగ శాఖా కార్యదర్శి జావో లిజియాన్‌ తెలిపారు.

ఈ ఘటనపై భారత ప్రభుత్వానికి తీవ్రమైన నిరసన తెలిపామని చెప్పారు.

ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయని, ఇద్దరూ కొన్ని అంశాలపై అంగీకరించారని, ఇప్పుడు వాటిని ఉల్లంఘిస్తూ భారత్‌ సేనలు సోమవారం నాడు రెండు సార్లు చైనా భూబాగంలోకి వచ్చి చైనా సైనికులపై దాడులు చేశారని చెప్పారు.సరిహద్దు రేఖను భారత్‌ సైనికులు దాటవద్దని, ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాల వల్ల పరిస్తితి మరింత జఠిలంగా మారే అవకాశముందని చైనా హెచ్చరిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube