Amritsar Canada : అమృత్‌సర్- కెనడాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ నడపండి : ఎయిర్ కెనడాకు భారత సంతతి ఎంపీల లేఖ

కెనడా- పంజాబ్ రాష్ట్రాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ నడపాలంటూ కెనడాలో స్థిరపడిన సిక్కు ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.కెనడాలో సిక్కులు, పంజాబీలు, ఇతర భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్ట్ ఫ్లైట్స్ నడపాలని వారు ఆ దేశ ప్రభుత్వ విమానయాన సంస్థను కోరారు.

 Indo Canadian Mps Request For Direct Flights To Amritsar ,  Canada, Indo Canadia-TeluguStop.com

ఈ మేరకు ఎయిర్ కెనడాకు భారత సంతతి ఎంపీలు టిమ్ ఉప్పల్, జస్‌రాజ్ సింగ్ హలన్, బ్రాడ్లీ విస్, మార్క్ స్ట్రాల్‌లు లేఖ రాశారు.కెనడాలోని పలు నగరాల నుంచి అమృత్‌సర్‌ల మధ్య నేరుగా విమానాలు నడపడం వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు కూడా ప్రయోజనకరంగా వుంటుందని వారు లేఖలో పేర్కొన్నారు.

అందుబాటులో వున్న డేటాను బట్టి.భారత్ నుంచి టొరంటోకి ఏడాదికి ఐదు లక్షల మంది రాకపోకలు సాగిస్తూ వుంటారని అంచనా.

వీరిలో ఎక్కువమంది పంజాబీలే.కెనడా- భారత్‌లోని అమృత్‌సర్‌ల మధ్య నేరుగా విమాన సర్వీసులు లేవు.

అటు నుంచి ఇటు రావాలన్నా.ఇటు నుంచి అటు వెళ్లాలన్నా మధ్యలో విమానాలు మారాల్సి వస్తోందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు… కెనడా ఇటీవల భారత్‌తో ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఒప్పందాన్ని పొడిగించినట్లు ప్రకటించింది.తద్వారా రెండు దేశాల మధ్య అపరిమిత సంఖ్యలో విమానాలను నడపడానికి విమానయాన సంస్థలకు అనుమతిస్తుంది.

అయితే ఈ ఒప్పందం ప్రకారం.కెనడియన్ ఎయిర్‌లైన్స్‌కు భారత్‌లోని బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైకి మాత్రమే విమానాలను నడిపేందుకు అనుమతి వుంది.

ఈ జాబితాలో అమృత్‌సర్ లేదు.

Telugu Air Canada, Amritsar, Bengaluru, Canada, Chennai, Hyderabad, Mark Strahl,

అధికారిక లెక్కల ప్రకారం.కెనడాలో దాదాపు 9,50,000 మంది పంజాబీలు వున్నట్లు అంచనా.2021 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో దాదాపు 2.6 శాతం మంది వీరే.ఈ కుటుంబాలలో చాలా మందికి పంజాబ్ రాష్ట్రంలో కుటుంబం, స్నేహితులు, ఇతర ఆత్మీయులు వున్నారు.

భారతదేశం కెనడాకు నాల్గవ అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మార్కెట్‌గా వుంది.ప్రతి నిత్యం వేలాది మంది పంజాబీలు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాయాలనికి వెళతారు.ఇప్పటికే 14000 మందికి పైగా కెనడియన్ పౌరులు, శాశ్వత నివాస హోదా వచ్చినవారు అమృత్‌సర్‌కు నేరుగా విమాన సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ ఏడాది పార్లమెంటరీ పిటిషన్‌‌ వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube