ఇండో అమెరికన్ మహిళ..రికార్డు..???

భారతీయ మహిళ, విద్యావేత్త అయిన గీతా గోపీనాథ్‌ కి అమెరికాలో కీలక పదవి వరించింది.అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ ఎకనామిస్ట్‌ గా ఆమె పదవి భాద్యతలని చేపట్టారు.

 Indo Anglo Woman Gets New Record In America-TeluguStop.com

అంతేకాదు ఐఎంఎఫ్‌ ఉన్నత పదవి అలంకరించిన తొలి మహిళగా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు కూడా.గత సంవత్సరం పదవీ విరమణ చేసిన మోరీ ఓబ్స్‌ ఫెల్డ్‌ స్థానంలో ఆమె నియమిపబడ్డారు.

ఇదిలాఉంటే గత సంవత్సరం అక్టోబర్‌లో గీతా గోపీనాథ్‌ నియకాన్ని ప్రకటిస్తూ ఐఎంఎఫ్‌ చీప్‌ క్రిస్టీన్‌ లగార్డే ‘గీతా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక శాస్త్రవేత్తల్లో ఒకరంటూ కితాబు ఇచ్చారు.అయితే ఈ పదవి చేపట్టిన భారతీయుల్లో గీత రెండో వ్యక్తి కావడం కూడా ఒక విశేషం.ఆమెకి ముందు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ కూడా ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థిక శాస్త్రవేత్తగా పనిచేశారు.

అయితే ఈ సందర్భంగా మాట్లాడిన గోపీనాద్ ఐఎంఎఫ్‌లో తన నియామకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకి దక్కిన గౌరవంగా భావిస్తానని ఆమె అన్నారు.ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందిన ఆమె ,ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నుంచి ఎంఏ పట్టాలు సాధించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube