అమెరికాలో ఓ పరిశోధనశాలకి 'భారత అమెరికన్' జంట పేరు..!  

Indo-americans Name Was Sugusted For A Famouse Resech Lab-

అమెరికాలో ఎన్నో ఏళ్ల క్రితమే స్థిరపడిన ఉన్నతవిద్యావంతులు అయిన దుర్గా , సుశీల్ అగర్వాల్ ల జంట ఆర్ధికంగా కూడా ఎంతో స్థిరపడ్డారు.ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడ పేరొందిన ఆ దంపతుల జంట అమెరికాలో ఉండే అనేక విద్యాలయాలు యూనివర్సిటీ లకి భూరి విరాళాలు అందించారు ఈ క్రమంలోనే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో లో కూడా భారీ విరాళాన్ని అందించారు..

అమెరికాలో ఓ పరిశోధనశాలకి 'భారత అమెరికన్' జంట పేరు..!-Indo-Americans Name Was Sugusted For A Famouse Resech LAB

అయితే తాజాగా ఈ యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌లోని ఇంజనీరింగ్‌ పరిశోధనశాలకు, ఓ భారత- అమెరికన్‌ జంట పేరు పెట్టనున్నారని తెలుస్తోంది.ఈ భారతీయ దంపతులు ఇద్దరూ ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎన్నో సార్లు విరాళాలు ప్రకటించారు కూడా.

దాంతో 2017లో నిర్మించిన ఓ భవనానికి వారి పేరు పెట్టి గౌరవించాలని భావించారు.

అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.ఈ యూనివర్సిటీ కి అధ్యక్షురాలిగా భారతీయ అమెరికన్ ఉండటం గమనార్హం…ఆమె పేరు “రేణు ఖటోర్‌”.దాదాపు 375 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనంలోని ఒక అంతస్తు ఇప్పటికే ఈ జంట పేరుతో ఉన్నది అయితే మరొక అంతస్తుకి వీరి పేరు పెట్టనున్నారని “రేణు ఖటోర్‌” తెలిపారు.