బిడెన్ కోసం రూ. 25 కోట్లు సేకరించిన ఇండో అమెరికన్స్..!!!  

Indo Americans Virtual Fund Raising For joe Biden, Democratic Party, Indo American Voters, America Elections, Kamala Harris - Telugu America Elections, Democratic Party, Indo American Voters, Indo Americans Virtual Fund Raising For Joe Biden, Kamala Harris

అమెరికా ఎన్నికల్లో గెలిచేది బిడెనా లేక ట్రంపా అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ బిడెన్ గెలిస్తే ఎవరికి లాభం, ట్రంప్ గెలిస్తే ఎవరికి లాభం అనే లెక్కలు ఇప్పటికే వేసేసుకున్నారు ఇండో అమెరికన్స్.కొందరు ఇండో అమెరికన్స్ బిడెన్ కి మరికొందరు ట్రంప్ కి మద్దతు ఇస్తున్నారు.

TeluguStop.com - Indo Americans Fund Raising Joe Biden

అయితే అత్యధిక శాతం బిడెన్ కి మద్దతుగా నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే బిడెన్ ఎన్నికల క్యంపైన్ కోసం రాత్రికి రాత్రే ఇండో అమెరికన్స్ కొందరు కలిసి ఏకంగా రూ.25 కోట్లు ఫండ్ సేకరించారు.ఒక్క రాత్రిలో ఇంత పెద్దమొత్తంలో నిధులు సేకరించడం ఇదే ప్రధమమని బిడెన్ నేషన్ ఫైనాన్స్ కమిటి మెంబర్ రమేష్ కంపూర్ ప్రకటించారు.

వర్చువల్ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి బిడెన్ కూడా హాజరయ్యారు.ఒక్క రాత్రే ఇంత పెద్ద మొత్తంలో నిధులు సేకరించడంపై ఉబ్బితబ్బిబైన బిడెన్ ఇండో అమెరికన్స్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

TeluguStop.com - బిడెన్ కోసం రూ. 25 కోట్లు సేకరించిన ఇండో అమెరికన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఉపాధ్యక్ష రేసులో భారత సంతతికి చెందిన కమలా హారీస్ ఉండటం వలనే ఇదంతా సాధ్యమయ్యిందని బిడెన్ తెలిపారు.మీరు నాపై చూపించిన ఈ అభిమానానికి నేను ఋణపడి ఉంటానని, భవిష్యత్తులో ఇండో అమెరికన్స్ అభివృద్దిలో తప్పకుండా నా పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.ఇదిలాఉంటే

అమెరికాలో వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలుపు అసాధ్యమని భావించిన ఇండో అమెరికన్స్ బిడెన్ కి మద్దతు ఇవ్వడానికి సిద్దమయ్యారని, అందుకే ఈ తరహ కార్యక్రమాలు చేపడుతున్నారని అంటున్నారు నిపుణులు.కానీ బిడెన్ గెలుపు భారత్ కి గట్టి దెబ్బ తగలడానికి పూర్తిగా ఆస్కారం ఉందని, ట్రంప్ మాత్రమే భారత్ తో స్నేహ హస్తం అందించగలరని చైనా, పాకిస్తాన్ తో మంచి సంభంధాలు ఉన్న బిడెన్ భవిష్యత్తులో భారత్ పై ఎలాంటి వైఖరి కనబరుస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#IndoAmerican #IndoAmericans #Kamala Harris

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indo Americans Fund Raising Joe Biden Related Telugu News,Photos/Pics,Images..