మా దేశానికి సాయం చేయండి...బిడెన్ కు ఇండో అమెరికన్స్ విజ్ఞప్తి..!!

కరోనా మహమ్మారి భారత్ లో మళ్ళీ తన ప్రభావాన్ని చూపుతోంది.సెకండ్ వేవ్ రూపంలో వచ్చిన మహమ్మారి గతంలో కంటే కూడా ప్రస్తుతం విశ్వరూపం చూపిస్తోంది.

 Indo-americans Appeal To Biden To Help Our Country, Biden, India, Anthony Fauci,-TeluguStop.com

రోజు రోజుకు వేలాది కేసులు పెరిగిపోవడంతో పాటుమృతుల సంఖ్య కూడా అధికవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పలు దేశాలు భారత్ కు తాము సాయం చేస్తామని ముందుకు వస్తున్న నేపధ్యంలో తమ భారత దేశానికి సాయం చేయాలంటూ భారత ఎన్నారైలు బిడెన్ కు వినతులు ఇస్తున్నారు.

మనకెంతో మిత్ర దేశమైన భారత్ కు సాయం చేయాలని బిడెన్ పై ఒత్తిడి పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది.అమెరికాలోని చట్టసభలో సభ్యులు, పలు కీలక పదవులలో ఉన్న భారత సంతతి ప్రజలు అందరూ కలిసి బిడెన్ భారత దేశానికి సాయం చేయాలని కోరుతున్నారు.

కరోనా వ్యాక్సిన్ , వైద్య పరికరాలు, అందించాలని సూహిస్తున్నారు ఈ నేపధ్యంలో అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కరోనాతో భారత్ యుద్ధం చేస్తోందని ఈ పోరులో భారత్ కు తాము అండగా ఉంటామని ప్రకటించారు.

అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ భారత్ కు సాంకేతిక సహకారం అందిస్తుందని తెలిపారు.ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఫౌసీ.

ఇదిలాఉంటే ,మరో వైపు అమెరికన్స్ కు ప్రాధాన్యత ఇచ్చిన తరువాత మాత్రమే భారత్ కు తమ సాయం ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి నెడ్ ప్రెస్ స్పష్టం చేశారు.వ్యాక్సిన్ తయారీలో ముడుపదార్దాల ఎగుమతులపై నిషేధం ఎత్తేసే అవకాశమే లేదని అన్నారు.

దాంతో భారత్ కు అమెరికా సాయం అందుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది.ఈ క్రమంలో భారత ఎన్నారైలు, అమెరికా ప్రభుత్వంలోని ప్రవాస భారతీయులు భారత్ కు సాయం చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube