అమెరికాలో బయటపడ్డ భారీ స్కామ్..ఇండో అమెరికన్ మహిళకు 5 ఏళ్ళ జైలు శిక్ష...!!!

Indo American Woman Sentenced To 5 Years In Jail

దొంగ తనం చేయడానికి దొంగలు ఉపయోగించే బుర్ర, వారి పనితనం అదేదో మంచి పనిచేయడానికి ఉపయోగిస్తే పరువు దక్కుతుంది, ఆ పైన మంచి భవిష్యత్తు ఉంటుంది కదా అంటే అవుననే చెప్పాలి .కొన్ని కొన్ని దొంగ తనాలు చూస్తే ఇలాంటి ఫీలింగ్ ప్రతీ ఒక్కరికి కలుగుతుంది.

 Indo American Woman Sentenced To 5 Years In Jail-TeluguStop.com

అమెరికాలో జరిగిన ఓ స్కామ్ తీరు చూస్తే ఇలాంటి ఆలోచనే వస్తుంది.అమెరికాలో భారత సంతతి మహిళా రూ.74 కోట్ల స్కామ్ చేసిన తీరు చూస్తే అన్ని తెలివితేటలు ఉండి ఇలాంటి బుద్దేంటి అనుకోక మానరు.ఇంతకీ అసలేం జరిగిందంటే.

మూడేళ్ళ క్రితం ప్రభుత్వం ద్వారా గిరిజన విద్యార్ధులకు అందాల్సిన ల్యాప్టాప్ లను భారత సంతతికి చెందిన సౌరబ్ చావ్లా అనే మహిళ ఈ కామర్స్ వెబ్సైటు లలో విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయింది.ప్రభుత్వం తరుపున పిల్లలకు అందాల్సిన ఈ ల్యాప్టాప్ లు చావ్లా వద్దకు ఎలా వచ్చాయని కూపీ లాగడంతో డొంక మొత్తం కదిలింది క్రిస్టినా స్టాక్ అనే మహిళ న్యూ మెక్సికో లోని ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.

 Indo American Woman Sentenced To 5 Years In Jail-అమెరికాలో బయటపడ్డ భారీ స్కామ్..ఇండో అమెరికన్ మహిళకు 5 ఏళ్ళ జైలు శిక్ష…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్థానిక ప్రభుత్వం ఆ స్కూల్ లో చదువుకునే పిల్లలకు ఇంటర్నెట్ ను అందుబాటులో ఉంచాలని భావించి వారికి విలువైన ఆపిల్ ల్యాప్టాప్ లు ఉచితంగా అందించాలని నిర్ణయించింది.ఈ క్రమంలోనే.

ప్రభుత్వం 2012 లో ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది.పిల్లలకు ల్యాప్టాప్ లు అందేలా క్రిస్టినా స్టాక్ కు భాద్యతలు అప్పగించింది.

దాంతో విలువైన ల్యాప్టాప్ లు కళ్ళముందు ఉండటంతో ఆమె వాటిని పక్కదారి పట్టించే క్రమంలో ఇండో అమెరికన్ అయిన సౌరభ్ చావ్లా కు వాటిని అందించింది.దాంతో సౌరభ్ చావ్లా వివిధ వెబ్సైట్ లలో వీటిని విక్రయానికి పెట్టి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నారు.

ఇలా 2012 నుండి మొదలైన వీరి ఇద్దరి స్కామ్ 2018 వరకూ కొనసాగింది.అయితే పిల్లలకు ల్యాప్ టాప్ లు అందటం లేదనే ఫిర్యాదు అధికారుల దృష్టికి వెళ్ళడంతో 2018 లో క్రిస్టినా ను అరెస్ట్ చేయగా విచారణలో ఆమెతో పాటు సౌరబ్ చావ్లా ప్రధాన నిందితురాలుగా తేలింది, వీరికి మరొక వ్యక్తి సాయం చేశారని నిర్ధారించుకున్న పోలీసులు సాక్షాధారాలతో సహా కోర్టు ముందు ఉంచడంతో సౌరభ్ చావ్లా కు ఐదున్నరేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Indo-American woman sentenced to 5 years in jail , Indo-American, woman, The Christina stock, Rs. 74 crore scam, Laptop, Saurabh Chawla, New Mexico - Telugu Indo American, Indoamerican, Mexico, Rs Crore Scam, Saurabh Chawla, Christina Stock

#Indo American #Mexico #Rs Crore Scam #IndoAmerican #Saurabh Chawla

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube