'ఇండో అమెరికన్'...మహిళకి అత్యత్తమ అవార్డ్...   Indo-American Minal Patel Received The Presidential Medal     2018-10-20   12:33:31  IST  Surya

అమెరికాలో భాతీయులకి గుర్తింపు రావడం పెద్దగా విషయం కాదు ఎందుకంటే అక్కడ కీలకమైన భాద్యతలని నిర్వహిస్తూ ఎన్నో ఏళ్లుగా అమెరికాలోనే ఉంటూ అమెరికా అభివృద్దిలో భారతీయుల పాత్ర ఎంతో కీలకమని ఎన్నో సందర్భాలలో నిరూపించారు..అందుకు గాను ఎన్నో మరెన్నో అవార్డులు భారతీయులని వరించాయి కూడా.

అయితే తాజాగా భారత సంతతి మహిళకి అత్యున్నతమైన పురస్కారం లభించింది..

మానవుల అక్రమ రవాణాపై చేసిన పోరాటానికి..అక్రమ రవాణాని అరికట్టడంలో ఎంతో ప్రతిభ కనబరిచిన భారత సంతతి మహిళా “మినల్‌ పటేల్‌ దవీస్‌” కి అమెరికా అధ్యక్షుడి పురస్కారం వరించింది. మానవుల అక్రమ రవాణాను నిరోధించేందుకు హోస్టన్‌ నగర మేయర్‌ సిల్వెస్టర్‌ టర్నర్‌కు ఆమె సలహాదారుగా పనిచేశారు. శ్వేత సౌధంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పాంపియో చేతుల మీదుగా ప్రెసిడెన్సీ పతకాన్ని ఆమె అందుకున్నారు.

Indo-American Minal Patel Received The Presidential Medal-

అయితే అమెరికాలోనే అత్యున్నత గౌరవం తనకి దక్కినందుకు ఎంతో సంతోషంగా , గర్వంగా ఉందని ఆమె అన్నారు. అమెరికాలో నాలుగో పెద్ద నగరం హోస్టన్‌లో మానవుల అక్రమ రవాణా నిరోధించేందుకు ఆ నగర మేయర్‌కు సలహాదారుగా ఆమె 2015లో నియమితులయ్యారు…అప్పటి నుంచీ ఆమె ఈ అక్రమ రవాణాని నివారించడంలో ఎంతో కీలకమైన పాత్రని పోషించారు.

2 Attachments