'టైమ్స్'...కెక్కిన ఇండో అమెరికన్ కిడ్...!!

ప్రతిభ ఉంటే చాలు ఏ దేశమేగినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా విజయాలు సొంతం చేసుకోవచ్చు.ముఖ్యంగా భారతీయుల విషయంలో ఇది అక్షర అత్యం.

 Indo American Girl In To Times Magazine, Time Magazine Kid Of The Year, Contamin-TeluguStop.com

విదేశాల్లో ఉంటూ వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిస్తున్న భారతీయులు లెక్కకు మించే ఉన్నారు.అగ్ర రాజ్యం అమెరికా నేడు ఈ స్థాయిలో ఆర్ధికంగా బలమైన దేశంగా మారడంలో ప్రధాన పాత్ర పోషించింది ఇండో అమెరికన్స్ అని చెప్పడంలో సందేహం లేదు.కేవలం ఆర్ధిక వ్యవస్థపై మాత్రమే కాదు రాజకీయ వ్యవస్థలో సైతం భారతీయులు అమెరికా రాజకీయాల్లో చెరగని ముద్ర వేస్తున్నారు.తాజాగా

15 ఏళ్ళ ఇండో అమెరికన్ బాలిక ఓ అరుదైన ఘనత సాధించింది.తన ప్రతిభతో టైం మ్యాగజైన్ కిడ్ ఆఫ్ ది ఇయర్ గా రికార్డ్ సృష్టించింది.కలుషితమైన మద్యపానం నుంచి సమస్యల పరిష్కారంపై శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆమె చేసిన ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలను అందించాయి.

దాంతో ఆమె ప్రతిభను గుర్తించిన టైమ్స్ ఆమెకు టైం మ్యాగజైన్ కిడ్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది.దాదాపు 5వేల మంది పోటీ పడగా వారందరినీ వెనక్కి నేట్టిమరీ గీతాంజలీ రావు ఈ అరుదైన గుర్తింపుకు ఎంపిక అయ్యింది…ఇక

Telugu Angelina Jolie, Alcohol, Cyber Scams, Gitanjali Rao-Telugu NRI

ఆమె ఎంపిక విధానంలో ప్రముఖ పాత్ర పోషించారు హాలీవుడ్ నటి, ప్రముఖ సమాజిక కార్యకర్త అయిన ఎంజలీనా జాలీ.వర్చువల్ విధానం ద్వారా ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఎంజలీన ఆమె కనుగొన్న పరిష్కారాల గురించి వివరంగా తెలుసుకున్నారు.పర్యావరణంలో జరుగుతున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పుట్టుకొస్తున్న సైబర్ మోసాలపై ఆమె పలు రకాల పరిష్కారాలు చూపించారని ఎంజేలినా తెలిపారు.

గీతాంజలీ రావు ఎంపికపై అమెరికాలోని ఎన్నారై సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.ఇదిలాఉంటే ఈ పురస్కారానికి ఎంపిక అయిన గీతాంజలీ రావు మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన, పర్యావర మార్పులు, మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.

వీటికి ప్రభుత్వం పరిష్కారం చూపాలని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube