న్యూయార్క్ : మేయర్ ఎరిక్ ఆడమ్స్ టీమ్‌లో మరో ఇండో అమెరికన్‌‌కు కీలక పదవి

ఇటీవల న్యూయార్క్ కొత్త మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎరిక్ ఆడమ్స్ తన మార్క్ చూపిస్తున్నారు.నగర పోలీస్ కమీషనర్‌గా తొలిసారి మహిళను నియమించిన ఆయన.

 Indo American Dilip Chauhan Picked For Key Post By New York Mayor,indo American-TeluguStop.com

తన జట్టులో నిపుణులు, సమర్ధులైన వారికి చోటు కల్పిస్తున్నారు.వీరిలో భారత సంతతి వారు కూడా వున్నారు.

తాజాగా మరో ఇండో అమెరికన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు ఎరిక్.
న్యూయార్క్ మేయర్ కార్యాయలంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలపై అంతర్జాతీయ వ్యవహారాల విభాగం డిప్యూటీ కమీషనర్‌గా దిలీప్ చౌహన్‌ను నియమించారు.

ఆగస్ట్ 2017లో నస్సౌ కౌంటీలో మైనారిటీ వ్యవహారాల డిప్యూటీ కంట్రోలర్‌గా దిలీప్ నియమితులయ్యారు.ఆయన 1999లో అమెరికాకు వలస వెళ్లారు.2015లో సౌత్ అండ్ ఈస్ట్ ఆసియా కమ్యూనిటీ వ్యవహారాల డైరెక్టర్‌గా కంట్రోలర్‌ కార్యాలయంలో చేరిన దిలీప్ చౌహాన్, 2017 నుంచి కంట్రోలర్‌కు సీనియర్ సలహాదారుగా పనిచేశారు.

Telugu Dilichauhan, Eric Adams, Indoamerican, Affairsnassau, York, York Mayor-Te

మైనారిటీ వ్యవహారాలకు డిప్యూటీ కంట్రోలర్‌గా పనిచేసిన తర్వాత , బ్రూక్లిన్ అధ్యక్షుడి కార్యాలయంలో ఆగ్నేయా , ఆసియా వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బ్రూక్లిన్‌లోని దక్షిణాసియా, ఆసియా కమ్యూనిటీకి సాధికారత కల్పించేందుకు దిలీప్ ఎంతో శ్రమించారని న్యూయార్క్ మేయర్ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.

ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన .కార్పోరేట్ రంగానికి, దక్షిణాసియా సమాజానికి మధ్య డిస్‌కనెక్ట్ వున్నట్లు గ్రహించానని పేర్కొన్నారు.వ్యాపార అవకాశాలను పెంచడానికి, ప్రభుత్వ బ్యూరోక్రసీని నావిగేట్ చేయడానికి తన పరిధి మేరకు ప్రయత్నించానని చౌహాన్ చెప్పారు.

నస్సౌ కౌంటీలో మైనారిటీ వ్యవహారాల డిప్యూటీ కంట్రోలర్‌గా ఎంపికైనప్పుడు.స్వామి నారాయణ విభాగానికి చెందిన పవిత్ర గ్రంథమైన వచనామృతంపై చౌహాన్ ప్రమాణం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube