NASA లో ఇండో - అమెరికన్స్ హవా...భారతీయ మహిళా శాస్త్రవేత్తకు కీలక భాద్యతలు..!!

నాసా అమెరికాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతరక్ష పరిశోధనా సంస్థ.నాసాలో పనిచేయడం అంటే ఎంతో మంది శాస్త్రవేత్తలు గొప్పగా భావిస్తారు.

 Indo American Climate In Nasa Key Responsibilities For Indian Woman Scientist-TeluguStop.com

అలాంటి నాసాలో ప్రస్తుతం భారత శాస్త్రవేత్తలు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.ఎంతో మంది భారతీయులు తమ నైపుణ్యంతో నాసాలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు.

తాజాగా నాసాలో పనిచేస్తున్న భారతీయ మహిళకు కీలక భాద్యతలు అప్పగించారు, ఆమె పేరు సుభాషిణీ అయ్యర్.

తమిళనాడు లోని కోయంబత్తూరు లో పుట్టిన సుభాషిణీ అయ్యర్.స్థానికంగా ఉన్న ఓ కళాశాలలోనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు.ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఆ కాలేజీ నుంచీ మొట్టమొదటి సారిగా ఇంజనీరింగ్ పట్టా తీసుకున్న మొదటి మహిళ సుభాషిణి కావడం గమనార్హం.

ఇదిలాఉంటే ఉన్నత చదువుల ఆ తరువాత ఉన్నత చదువులు చదివిన ఆమె అంతరిక్ష పరిసోధనలపై దృష్టి సారించారు.ఆ దిశగా అడుగులు వేస్తూ నేడు ఆర్టేమిస్ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి తీసుకుపోయే బోయింగ్ కోర్ ను మన సుభాషిణీ అయ్యర్ డీల్ చేసే స్థాయికి వెళ్ళారు.

Telugu Coimbatore, Space Research, Subhashini Iyer-Telugu NRI

నాసా ఆమెకు ఉన్నత పదవిని అప్పగించడం పై స్పందించిన సుభాషిణి అందుకు ఎంతో సంతోషంగా ఉందని, అత్యంత కీలక మైన భాద్యతలు తనపై ఉన్న నమ్మక్తంతో ఇచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.చంద్రుడిపైకి మనుషులను పంపడం, అక్కడి పరిస్థితులను గమనించడం అలాగే అంగారక గ్రహంపై మంషులను పంపడం పై పరిశోధనలు చేయడం అక్కడికి మనుషులను పంపే పరిస్థితులను అంచనా వేయడం తమ ముందు ఉన్న లక్ష్యమని తెలిపారు.సుభాషిణి అయ్యర్ నాసాలో ఉన్నత పదవి చేపట్టడంపై నాసాలో పనిచేస్తున్న భారత సంతతి అమెరికన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube