అమెరికాలో భారత ఎన్నారై భారీ మోసం..!!!

అమెరికాలోని న్యూజెర్సీ లో ఉంటున్న భారత ఎన్నారై శివనందన్ మహారాజ అనే వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు.న్యూజెర్సీ లోనే ఐటీ కన్సల్టెంట్ గా సేవలు అందిస్తున్నాడు.

 Indo American 13 Cr Fraud In America-TeluguStop.com

అయితే ఇతడు ముల్టీమిలియన్ డాలర్ కికి బ్యాక్ పధకం పేరుతో భారీ మోసానికి పాల్పడినట్టుగా గుర్తించిన పోలీసుల అధికారులు అదుపులోకి తీసుకున్నారు.నేరాలు అన్ని రుజువయితే అతడికి దాదాపు 20 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో భారత ఎన్నారై భారీ మ�

2005 నుంచీ 2015 వరకూ ఉద్యోగుల ఆరోగ్య, పదవీ విరమణ ప్రయోజనాలకి సంభందించిన కొన్ని మిలియన్ డాలర్ల సొమ్ముని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ ఎన్రీకో రుబానొ తో కలిసి భారీ గా దారి మళ్ళించాడని అమెరికా న్యాయస్థానం పేర్కొంది.అధికారిక లెక్కల ప్రకారం మహారాజ సుమారు రెండు మిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీ లో దాదాపు రూ.రూ.13,76,30,000 కోట్ల భారీ మోసానికి పాల్పడినట్లుగా ధృవీకరించింది.

ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసు లో త్వరలో తీర్పు వెలువడ నుందని తెలుస్తోంది.

శివనందన్ తో పాటుగా ఈ కుంభకోణంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ ఎన్రీకో రుబానొకు కూడా సంభంధం ఉందని ఇద్దరు శిక్షార్హులని న్యాయవాది అన్నట్టుగా తెలుస్తోంది.శివనందన్ 20 ఏళ్ళ జైలు జీవితంతో పాటు భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సి ఉంటుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube