రూ.20 వేలు ఇచ్చినా ఇందిరమ్మ ఇళ్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో భయ్యా కనకయ్య అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన మంగళవారం గ్రామంలో కలకలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి అతనిని బుజ్జగించి కిందకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అధికారి పార్టీకి చెందిన ఓ నాయకుడికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానంటే చెపితే రూ.20000 ఇచ్చానని, అయినా ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.ప్రస్తుతం అతనిని పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Latest Suryapet News