అక్క ఫ్రెండ్‌పై కన్ను... వేధింపులు: అమెరికాలో భారత సంతతి కుర్రాడి అరెస్ట్

అక్క ఫ్రెండ్.తనకు సోదరితో సమానమన్న ఇంగీతం మరిచిపోయి తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించిన భారత సంతతి యువకుడిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు.

 Indin Origin Teen Accused Of Cyber Stalking Woman For Months, Soliciting People-TeluguStop.com

ఇతనిని డెన్మాండ్ బబ్లూ సింగ్ (19)గా గుర్తించారు.మేరీలాండ్‌లో నివసించే అక్క స్నేహితురాలిని చూసి ఇష్టపడిన బబ్లూ.

తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రతిపాదించాడు.అయితే ఇందుకు ఆ యువతి తిరస్కరించడంతో సింగ్‌లోని ఉన్మాది బయటకు వచ్చాడు.

ఆమెకు ఈ మెయిల్స్ పంపుతూ నిన్ను రేప్ చేసి, చంపేస్తానంటూ బెదిరించాడు.అక్కడితో ఆగకుండా మీ ఇంట్లో బాంబులు పెట్టి మీ కుటుంబం మొత్తాన్ని హతమారుస్తానని అన్ని రకాలుగా ఆమెను బెదిరించి లోంగదీసుకునేందుకు ప్రయత్నించాడు.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఆ యువతిని వేధించడానికి దాదాపు వందకు పైగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సాధనాలు, ఫోన్ ఖాతాలను వినియోగించాడు.అతని వేధింపులు ఎక్కువకావడంతో సహనం నశించిన బాధితురాలు అక్టోబర్‌లో బాల్టిమోర్ కౌంటీ పోలీసులను ఆశ్రయించింది.

టెలిగ్రామ్ యాప్‌లో డెస్మండ్ అనే వ్యక్తి తనను చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపింది.అంతేకాకుండా బబ్లూ ఆ యువతి ఆన్‌లైన్ ఖాతాలను హ్యాక్ చేసి వాటి పాస్‌వర్డ్‌లను మార్చడంతో పాటు వాటిలో అభ్యంతరకర చిత్రాలను పోస్ట్ చేసేవాడని తెలిపింది.

Telugu Denmondbablu, Bomb Threat, Federal York, Hired, Maryland, App-Telugu NRI

ఆమె వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌‌లో పోస్ట్ చేయడంతో పాటు ఆ యువతిని వేధించాలని ఇతరులకు సూచించేవాడు.యువతిపై సైబర్ వేధింపులకు పాల్పడిన నేరంపై మంగళవారం బబ్లూని న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు.కంప్యూటర్‌ను ఉద్దేశపూర్వకంగా హ్యాక్ చేయడం, బూటకపు బాంబు బెదిరింపు కాల్, కిరాయి హత్యకు ఈమెయిల్ పంపడం వంటి అభియోగాలపై అతనిపై కేసు నమోదు చేశారు. డెన్మాండ్ దోషిగా తేలితే గరిష్టంగా 5 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube