విమానం లో కరోనా కలకలం,ఒకరికి పాజిటివ్  

IndiGo Ground Crew In Chennai-Coimbatore Flight As Passenger Tests Positive For Coronavirus, Coronavirus, IndiGo,Lockdown - Telugu Coronavirus, Indigo, Indigo Ground Crew In Chennai-coimbatore Flight As Passenger Tests Positive For Coronavirus, Lockdown

లాక్‌డౌన్ సడలింపుతో ఈ నెల 25 నుంచి దేశీయంగా విమానా ప్రయాణాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.థర్మల్ స్క్రీనింగ్ టెస్టుల తర్వాత ప్రయాణికులను ఒక చోట నుంచి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు.

 Indigo Passenger Corona Positive

అయితే ఈ క్రమంలో తాజాగా కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.స్క్రీనింగ్ టెస్ట్ లు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతుండడం తో కలవరం సృష్టిస్తుంది.

తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణం చేసిన ఓ వ్యక్తికి వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు.దీంతో 129 మంది క్వారంటైన్‌కు తరలించాల్సి వచ్చింది.
ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.చెన్నై నుంచి కోయంబత్తూరుకు 129 మందితో ఇండిగో విమానం బయలుదేరింది.దీంట్లో చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో పని చేసే వ్యక్తి కూడా ప్రయాణం చేశాడు.అయితే కోయంబత్తూరు వెళ్లిన తరువాత పరీక్షలు జరపగా,కరోనా అని తేలడం తో ఆ విమానంలో ప్రయాణించిన వారందరినీ కూడా క్వారంటైన్ కు తరలించాల్సి వచ్చింది.

విమానం లో కరోనా కలకలం,ఒకరికి పాజిటివ్-General-Telugu-Telugu Tollywood Photo Image

అనంతరం కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కూడా వెంటనే ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అతనితో పాటు కలిసి ప్రయానించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించగా వారికి మాత్రం నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది, అయితే ముందు జాగ్రత్త చర్యగా వారిని 14 రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ప్రయాణికులు ఎవరూ రోగికి దగ్గరగా లేరని, అందరూ విధిగా మాస్కులు ధరించారని ఇండిగో ప్రకటించింది.విమానం మొత్తం శానిటైజ్ చేసినట్టు వెల్లడించింది.మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం తో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది.రోజు రోజుకు కేసులు పెరుగుతుండడం తో మరోసారి కఠినంగా లాక్ డౌన్ ను విధించే అవకాశం కూడా లేకపోలేదు.

జూన్ 1 వ తేదీ నుంచి లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగిపోతుంది.మరి దీనిపై స్పష్టత మాత్రం రాలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indigo Passenger Corona Positive Related Telugu News,Photos/Pics,Images..