విమాన ప్రయాణంలో వికృత చేష్టలు.. నా దగ్గర బాంబు ఉందంటూ ప్రయాణికులను భయపెట్టన వ్యక్తి!

వింతలోకం, వింత మనుషులు. ఒక్కోసారి మన చుట్టూ వున్నవారిని చూస్తే మనం ఏలోకంలో ఉన్నామని అనిపించక మానదు.

 Indigo Flight Landed In Patna After Bomb Threat Details, Flight, Viral Latest, N-TeluguStop.com

ఎందుకంటే కొంతమంది తమ వికృత చేష్టలతో ఎదుటివారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వుంటారు.అలాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి మన చుట్టూ.

విమాన ప్రయాణం అనగానే చాలా మందికి భయం ఉంటుంది.సేఫ్‌గా టేక్ ఆఫ్ కావడం మొదలు.

అంతే సేఫ్‌గా ల్యాండ్ అయ్యే వరకు కాస్త భయం అనేది మనసులో ఉంటుంది.అలాంటి సందర్భాలలో విమానం టేకాఫ్ అయిన తర్వాత ఎవరన్నా బాంబు ఉన్నదని చెబితే అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

సరిగ్గా అలాంటి ఘటనే ఈ రోజు ఇండిగో ఫ్లైట్‌లో చోటుచేసుకుంది.ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌లో ఓ ప్రయాణికుడు ఉన్నట్టు ఉండి తన బ్యాగులో బాంబ్ ఉన్నదని అందరినీ బెంబేలెత్తించాడు.

దీంతో ఆ ఇండిగో ఫ్లైట్ 6ఈ-2126‌ను వెంటనే పాట్నా ఎయిర్‌పోర్టులో అర్ధాంతరంగా ల్యాండ్ చేశారు.తీరా బాంబు స్క్వాడ్, ఇతర పోలీసు సిబ్బంది వెంటనే విమానం వద్దకు చేరి విమానంలో బాంబు కోసం గాలింపులు చేపట్టగా వారికి ఏమీ లభించలేదు.

బాంబు ఉన్నదని బెదిరించిన ప్రయాణికుడి బ్యాగునూ తనిఖీ చేశారు.కానీ, అందులోనూ ఏమీ లభించలేదు.దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక విమానంలో ప్రయాణిస్తుండగా బాంబు ఉన్నదని బెదిరించిన వ్యక్తిని రిశి చాంద్ సింగ్‌గా గుర్తించారు.ఆ తర్వాత పోలీసులు రిశి చాంద్ సింగ్‌ను అరెస్టు చేయడం జరిగింది.ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని అనుమానిస్తున్నారు.

పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ ఇండియా టుడేతో మాట్లాడుతూ, బాంబు బెదిరింపులు చేయగానే వెంటనే ఆ విమానాన్ని పాట్నా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారని వివరించారు.ఇప్పటి వరకు విమానంలో ఏదీ కనిపించకున్నా.

ప్రొటోకాల్ ప్రకారం గాలింపులు చేస్తూనే ఉన్నామని వివరించారు.కాగా ఈ విమానాన్ని రద్దు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube