అల్లు అర్జున్ బుట్టబొమ్మకి స్టెప్పులేసిన ఇండిగో సిబ్బంది

అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సాంగ్ టిక్ టాక్ వీడియోల రూపంలో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.

 Indigo Crew Dances To Butta Bomma At Airport, Visakhapatnam, Allu Arjun Ala Vaik-TeluguStop.com

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం బుట్టబొమ్మ పాటకి స్టెప్పులు వేసాడు.అలాగే బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఈ పాటకి స్టెప్పులు వేసి వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

అంతగా ప్రతి ఒక్కరికి ఈ పాట రీచ్ అయ్యింది.అల్లు అర్జున్ కెరియర్ లో ఎక్కువ ప్రజాధారణ లభించిన సాంగ్ కూడా ఇదే కావడం విశేషం.

ఇక ఈ పాటకి సంబందించిన వీడియో సాంగ్ యుట్యూబ్ లో రికార్డు వేగంతో దూసుకుపోతుంది.కేవలం నాలుగు నెలల వ్యవధిలో 281 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.

దీనిని బట్టి ఈ పాటకి ఎంత ప్రజాదరణ ఉందొ అర్ధమవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా వైజాగ్ లోని ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిని కూడా ఆ పాట విశేషంగా ఆకర్షించింది.

ఎయిర్ పోర్టులో బుట్టబొమ్మ పాట వస్తుండగా, ఇండిగో సిబ్బంది డ్యాన్స్ చేశారు.మాస్కులు, హ్యాండ్ గ్లోవ్స్ ధరించిన ఎయిర్ హోస్టెస్ లు, పైలెట్లు ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ తరహాలో బన్నీ పాటకు స్టెప్పులేసి అందరినీ అలరించారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.మొత్తానికి బుట్టబొమ్మ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని రకాలగా మోత మోగిస్తుంది.సాయి పల్లవి పాటల తర్వాత సోషల్ మీడియాలో అత్యంత ఎక్కువ మంది వీక్షించే పాటలు అల్లు అర్జున్ సినిమాలలోనివే కావడం విశేషం అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube