తాజ్ మహల్ అంత ఈత్తైన చెత్త కొండ! అక్కడికి వెళ్తే ఇక అంతే

ప్రపంచం మనిషి ప్రతి కారణంగా పెరిగిపోతున్న వ్యర్ధాలు ఒక చోట చేరిస్తే అది ఎవరెస్ట్ అంత ఎత్తైన ఉంటుంది.అంతగా మనం ఈ భూమిపై కాలుష్య వార్ధాలని డంప్ చేసేస్తున్నాం.

 Indias Tallest Rubbish Mountain May Rise Higher Than Taj Mahal-TeluguStop.com

కొన్ని దేశాలు ఆ వ్యర్ధాలని రీ సైక్లింగ్ చేసి తిరిగి వాడుకుంటూ ఉంటే, మన దేశంలో మాత్రం ఈ చెత్తని సిటీకి దూరంగా కుప్పలుగా వేసేస్తూన్నాం, ఇలాంటి వ్యార్ధాలు ప్రతి సంవత్సరం పెరిగిపోతూ ఉన్నాయి.అయితే ఈ వ్యర్ధాలని ఒక్కోసారి తగలబెట్టేయడం వలన వాయు కాలుష్యం అవుతుంది.

అలాగే ఈ వ్యర్ధాలు కుళ్ళిపోవడం వలన కూడా ఓ రకమైన మీథేన్ గ్యాస్ రిలీజ్ అయ్యి కాలుష్య కారకంగా మారుతుంది.ఇక ఇండియాలో ఢిల్లీ లాంటి నగరాలలో ఈ కాలుష్య వ్యర్ధాలు ఎ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఢిల్లీలోని ఘాజీపూర్‌లో అనే ప్రాంతంలో ఉన్న చెత్త కుప్ప ఎత్తు ఏకంగా 213 అడుగులు ఉంది.మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెత్తను డంప్ చేయడానికి తగిన స్థలం లేకపోవడం వల్ల ఈ చెత్త కుప్ప కొండలా పేరుకుపోయింది.

ఈ చెత్తకుప్ప కొండ కారణంగా ఇప్పుడు చుట్టు ఉన్న ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు పేస్ చేస్తున్నారు.ఆగ్రాలోని తాజ్‌మహల్ ఎత్తు 239 అడుగులు.ఉంటే 2020 నాటికి ఘాజీపూర్‌లోని చెత్త కుప్ప ఎత్తు దానిని అధిగమించే అవకాశాలు ఉంది.ప్రతి ఏటా ఇక్కడ వేస్తున్న చెత్త కారణంగా ఈ కొండ ఎత్తు 33 అడుగుల పెరుగుతూ వస్తుంది.

ఈ చెత్తను డంప్ చేసిన ప్రాంతం ఏకంగా 40 ఫుట్‌బాల్ మైదానాలు విస్తీర్ణం ఉంటుంది.నిబంధన ప్రకారం.

అక్కడ చెత్తను వేయడం నిలిపేయాలి.కానీ, అధికారులు మాత్రం రోజూ వందలాది ట్రక్కులతో అక్కడ చెత్తను వేయడం కొనసాగించారు.

రోజుకు 2వేల టన్నుల చెత్తను అక్కడ డంప్ చేస్తున్నారు.మొత్తానికి ఈ చెత్త కొండ మరో సారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube