యూపీలో బయటపడ్డ సమాధుల చరిత్ర 3800 ఏళ్ళు

ప్రపంచంలో ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్న అత్యంత పురాతన నాగరికత భారతీయ నాగరికత అనే విషయం అందరికి తెలిసిందే.ఎన్నో గొప్ప గొప్ప నాగరికతలు, అద్బుత పట్టణాలు, దేశాలు కాలగర్భంలో కలిసిపోయిన భారతీయ నాగరికత మూలాలు మాత్రం ఇప్పటికి ఉన్నాయి.

 Indias Largest Known Burial Site Is 3800 Yrs Old-TeluguStop.com

అలాగే సనాతన ధర్మం కూడా ఇప్పటికి బ్రతికి ఉంది.అంత ఘనమైన చరిత్ర ఉన్న భారతీయ నాగరికత గురించి ప్రస్తుతం చాలా మంది, ఇతర విశ్వాసాల వారు ఎప్పటికప్పుడు తక్కువ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు.అయితే భారతీయ నాగరికత గొప్పతనం చిహ్నాలు బయటపడుతూ వాళ్ళకి సమాధానంగా నిలుస్తూ ఉంటాయి.

2005లో యూపీలోని సనౌలీలో బయటపడిన ఏకంగా 126 సమాధుల నుంచి అస్థిపంజరాలు బయటపడ్డాయి.ఇక అక్కడ దొరికిన శిలాజాలు, శవపేటికలు, వస్తువులు, మనుషుల అస్థిపంజరాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అవి 3,800 ఏళ్ల నాటివని కార్బన్​ డేటింగ్​ ద్వారా తేల్చారు.అప్పట్లో ఈ సమాధుల గురించి వార్త సంచలనం అయ్యింది.

వాటి ఉనికిని తెలుసుకోవడానికి దశాబ్దాలకి పైగా చరిత్రకారులు పరిశోధనలు చేస్తున్నారు.ఈ పరిశోధనల ఆధారంగా అక్కడ దొరికిన వస్తువులు, కత్తులు, డాళ్ళు పరిశీలించి కార్బన్ డేటింగ్ తో తాపనం చేసి అవి ప్రాచీన నాగరికతకి ఆనవాళ్ళుగా గుర్తించారు.

వాళ్ళంతా యుద్ధంలో మరణించిన వీర సైనికులు అయ్యి ఉంటారని చెప్పారు.సమాధుల్లో బయటపడిన దుస్తులు, అలంకరణల ఆనవాళ్లు, శవాన్ని పూడ్చేటప్పుడు శుద్ధి చేసిన విధానాన్ని చూస్తే వేదకాలం నాటి అంత్యక్రియ పద్దతులను అనుసరించారని తెలుస్తోందని రీసెర్చర్లు తెలిపారు.

మొత్తానికి ఈ నిరూపణ ద్వారా మహాభారతం, శ్రీకృష్ణ జననం అనేది వాస్తవం అని మరో సారి రుజువు అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube