నవీ ముంబయి' రూపశిల్పి కన్నుమూత

కొందరు కన్నుమూశాకే వారి గొప్పతనం తెలుస్తుంది.వారి ప్రతిభ, దేశానికి అందించిన సేవలు వెలుగులోకి వస్తాయి.

 India’s ‘greatest Architect’, Dies-TeluguStop.com

నవీ ముంబయికి రూపకల్పన చేసింది ఎవరో చెప్పగలరా? తెలియదు.మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ భవనం డిజైన్‌ చేసింది ఎవరో చెప్పగలరా? తెలియదు.ఆ గొప్ప ఆర్కిటెక్చర్‌ మృతి చెందిన తరువాత ఇంత గొప్పవాడా అనుకోవల్సివస్తోంది.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన కొన్ని గొప్ప కట్టడాలకు డిజైన్‌ చేసిన, దేశం గర్వించదగిన ఆర్కిటెక్చర్‌ ఛార్లెస్‌ కొర్రెయ మృతి చెందారు.

ఆయన వయసు ఎనభైనాలుగేళ్లు.అహ్మదాబాద్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌కు, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ భవనానికి, నవీ ముంబయికి ఛార్లెస్‌ రూపకల్పన చేశారు.నవీ ముంబయి నిర్మించిన సమయంలో ఆయన ఛీఫ్‌ ఆర్కిటెక్‌్టగా పనిచేశారు.ముంబయిలో హార్బరు వెంబడి నవీ ముంబయి అభివృద్ధి చెందింది.

అల్పాదాయ వర్గాల ఇళ్ల నిర్మాణానికి కూడా ఛార్లెస్‌ డిజైన్‌ చేశారు.ప్రభుత్వం పట్టణీకరణపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు.

సర్కారు ఛార్లెస్‌ను రెండు ‘పద్మ’ అవార్డులతో గౌరవించింది.ఛార్లెస్‌ తెలంగాణలోని సికింద్రాబాద్‌ నగరంలో జన్మించారు.

ఆయనకు ‘తెలుగు స్టాప్‌’ తరపున కూడా నివాళులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube