పుర్రె మార్పిడి చేసి చిన్నారి పునర్జన్మనిచ్చిన వైధ్యులు..దేశంలోనే తొలి పుర్రె మార్పిడి సర్జరీ..

మన శరీరంలో కిడ్నీ ప్రాబ్లం వస్తే దాతలు ఉంటే కిడ్నిని అమర్చొచ్చు.గుండెని.

 Indias First Skull Implant Surgery Saves Life Of 4 Year Old Pune Girl-TeluguStop.com

గుండెని అమర్చడం అంటే ఒక మనిషి ప్రాణాన్ని మరో మనిషి సొంతం చేయడమే.సదరు వ్యక్తి ఒప్పుకుంటే అదీ సాధ్యమే.

కానీ పుర్రె మార్పిడి సాధ్యమేనా.ఇప్పటివరకు సాధ్యం కాదనుకున్న పనిని సాధ్యం చేసి చూపించారు.

పూణె వైధ్యులు.

గత సంవత్సరం మేలో ఒక యాక్సిడెంట్ జరిగింది.అందులో ఒక పాప తలకు బలమైన గాయాలు అయ్యాయి…పుర్రే తీవ్రంగా దెబ్బతిన్నది.అపస్మారక స్థితిలో హస్పటల్ కు తీసుకువచ్చిన చిన్నారిని, తొలుత ఆమెను వెంటిలేటర్ సపోర్టుతో బతికించి,తర్వాత పరీక్షలు చేయగా.సీటీ స్కాన్ లో పుర్రె చితికిందన్న విషయం తెలిసింది.

దాంతో రెండు సర్జరీలు చేసి నాలుగేళ్ల పాపను బతికించారు.పాప బతికినప్పటికి,సమస్య తిరగబడింది.

బాలిక పుర్రెలో సమస్య నెలకొన్న కారణంగా 60 శాతం భాగాన్ని తిరిగి చేర్చాలని వైద్యులు నిర్ణయించారు.

అమెరికాకు చెందిన సంస్థ, పాప పుర్రెకు సంబంధించిన కొలతలు తీసుకుని, పాలీ ఎథిలిన్ బోన్‌తో త్రీ డైమెన్షనల్ రూపంలో పుర్రెను తయారు చేసింది.దీన్ని వైద్యులు విజయవంతంగా ఆమెకు అమర్చారు.ఇండియాలో స్కల్ ఇంప్లాంట్ సర్జరీ విజయవంతం కావడం ఇదే తొలిసారి.ఇది ఆ పాపకు పునర్జన్మ లాంటిదని చెప్పొచ్చు,అంతేకాదు భారత వైద్య చరిత్రలోనే అద్భుతం అని చెప్పొచ్చు.

ఇప్పుడు ఆ పాప స్కూలుకు వెళుతోందని, చక్కగా ఆడుకుంటూ ఆనందంగా ఉంది.పాపను చూసి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు.

వైధ్యో నారాయణో హరీ అన్నారు.ఆ దేవుడు మనకు జన్మనిస్తే,డాక్టర్లు పునర్జన్మనిస్తారు అనేదానికి చక్కటి ఉదాహరణ ఈ ఘటన…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube