భారత్ తొలి ప్రత్యర్థి పాకిస్తాన్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూలు విడుదల.. అక్టోబర్ 23 నుంచి టోర్నమెంట్..

టి20 ప్రపంచకప్ ప్రారంభ దశలోనే క్రికెట్ ప్రపంచం హోరెత్తిపోనుంది.చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్థాన్ తొలి మ్యాచ్లో పరస్పరం తలపడబోతున్నాయి.

 India's First Rival Pakistan .. T20 World Cup Schedule Released  Tournament From-TeluguStop.com

ఈ మ్యాచ్ అక్టోబర్ 24న దుబాయ్ లో జరుగుతుంది.యూఏఈ లో జరిగే ఈ ప్రపంచ కప్ షెడ్యూల్ ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది.పాక్తో పోరుకు గొప్ప వేటను ప్రారంభించనుంది భారత్.సెకండ్ మ్యాచ్ అక్టోబర్ 31న అబుదాబిలో న్యూజిలాండ్ తో ఢీకొట్టినుంది.ఆ తర్వాత నవంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్ తో ఆడుతుంది.భారత్ మిగతా రెండు సూపర్-12 మ్యాచ్ లను క్వాలిఫైయింగ్ గ్రూప్-బి విజేతతో నవంబర్ 5న, గ్రూప్-ఎ రన్నరప్తో నవంబర్ 8న ఆడుతుంది.

  గ్రూప్-ఏలో శ్రీలంక ఐర్లాండ్ నెదర్లాండ్, నమీబియా, గ్రూప్బి- లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా, న్యూగినియా ఉన్నాయి.

గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-12కు అర్హత  సాధిస్తాయి.

టోర్నీలో అసలు దశ అయిన సూపర్-13 అక్టోబర్ 23న మొదలవుతుంది.ఆరోజు ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా రెండుసార్లు, వెస్టిండీస్ తో ఇంగ్లాండ్ తలపడతాయి.

తొలి సెమీ ఫైనల్ నవంబర్ 10న అబుదాబిలో రెండో సెమీ ఫైనల్ నవంబర్ 11 దుబాయ్ లో జరుగుతాయి.నవంబర్ 14న జరిగే ఫైనల్ మ్యాచ్ దుబాయి ఆతిథ్యం ఇస్తుంది.

ఈ టోర్నమెంట్ కి భారత్, యూఏఈ, ఒమెన్ ఆతిథ్యమిస్తున్నాయి.కరోనా కారణంగా ప్రపంచ కప్ ను భారత్ నుంచి తరలించిన సంగతి మనందరికీ తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube