బాలీవుడ్ లో మొదటి స్వలింగ సంపర్క జంట బ్రేక్ అప్ చెప్పుకున్నారు

స్వలింగ వివాహాలని సుప్రీం కోర్టు చట్టబద్ధం చేసిన తర్వాత చాల మంది సేమ్ జెండర్ రిలేషన్ లో ఉన్నావారు బయటకి వచ్చి వారి రిలేషన్ స్టేటస్ ని చెప్పుకున్నారు.అంత వరకు చాటుమాటు వ్యవహారాలు సాగించిన వారు పెళ్లితో ఒకటై తమ భాగస్వామితో కొత్త జీవితాన్ని కూడా స్టార్ట్ చేశారు.

 India's First Gay Generation Gay Couple Separated From Each Other, Bollywood, Same Gender Relation, Gay Generation-TeluguStop.com

సుప్రీం తీర్పు తర్వాత చాలా మంది మగ మగ వివాహాలు చేసుకున్నారు.అలాగే ఆడ, ఆడ స్వలింగ రిలేషన్ షిప్ లని బయటకి తెలియజేశారు.

మారుతున్న కాలంతో పాటు సమాజంలో శారీరక లోపం కారణంగా ఇలాంటి స్వలింగ రిలేషన్స్ కోరుకునేవారు ఎక్కువ మంది కావడం వలన చట్టం కూడా ఒప్పుకోక తప్పలేదు.విదేశాలలో ఇలాంటి స్వలింగ రిలేషన్స్ పెద్ద సెలబ్రిటీలలో కూడా కనిపిస్తుంది.

 India's First Gay Generation Gay Couple Separated From Each Other, Bollywood, Same Gender Relation, Gay Generation-బాలీవుడ్ లో మొదటి స్వలింగ సంపర్క జంట బ్రేక్ అప్ చెప్పుకున్నారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక దేశ అధ్యక్షుడే స్వయంగా తాను స్వలింగ సంపర్కుడిని అని ప్రకటించుకున్నారు.అలాగే హాలీవుడ్ లో చాలా మంది నటులు తాము స్వలింగ రిలేషన్ లో ఉన్న విషయాన్ని బయట పెట్టారు.

ఇదిలా ఉంటే ఇండియన్ సెలబ్రిటీలకి వచ్చేసరికి బాలీవుడ్ లో ఒక స్వలింగ సంపర్క జంట ఉంది.బాలీవుడ్ లో మొదటి స్వలింగ సంపర్క జంటగా ఫేమస్ అయ్యారు మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధాంత్ పిల్లై దర్శకుడు అపూర్వ అస్రానీ.

వీరిద్దరూ గడిచిన 14 సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు.గతేడాది గోవాలో వీరిద్దరూ సొంత ఇల్లు కూడా కొనుగోలు చేశారు.తాము స్వలింగ సంపర్కులను ప్రకటించుకున్నారు.ఇప్పుడు తామిద్దరం విడిపోతున్నామని అపూర్వ అస్రానీ తాజాగా ప్రకటించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించారు.తమ నిర్ణయం స్వలింగ సంపర్కులను బాధిస్తుందని తెలిసినప్పటికీ, విడిపోవడం తప్పట్లేదని ప్రకటించారు.

నేను సిద్ధాంత్ విడిపోతున్నట్టు ప్రకటించడానికి చాలా బాధపడుతున్నాను.దేశంలో చాలా మంది ఎల్జీబీటీక్యూ కపుల్స్ కు మేం ఆదర్శంగా నిలిచాం.

ఈ విషయం వారందరినీ నిరాశపరుస్తుందని నాకు తెలుసు.కానీ.

ఈ 14 సంవత్సరాల కాలంలో ప్రతీ రోజు ఎంతో ముఖ్యమైనది, విలువైనది.ఇన్నేళ్ల తర్వాత మేం స్నేహపూర్వకంగానే విడిపోతున్నాం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube