వినూత్న ఆలోచన,ఈ గార్బేజ్ కేఫ్  

India S First Garbage Cafe In Chhattisgarh-

ఇటీవల ప్లాస్టిక్ వ్యర్ధాలపై ప్రజలకు ఎంత అవగాహన కల్పించడానికి ప్రయతించినప్పటికీ ఎలాంటి మార్పు రావడం లేదు.అయితే వినూత్నంగా ఆలోచించి ఒక సూపర్బ్ పద్దతిని పెట్టారు.గార్బేజ్ కేఫ్...

India S First Garbage Cafe In Chhattisgarh--India S First Garbage Cafe In Chhattisgarh-

ఇది వినడానికి కొంచం ఇబ్బందిగా అనిపించినప్పటికీ అక్కడ కెళ్ళి ఆహరం తినాలి అంటే మాత్రం చెత్త ఇవ్వాల్సిందే.అంటే అక్కడ కడుపునిండా భోజనం తినాలి అంటే డబ్బులు ఏమాత్రం చెల్లించనవసరం లేదు,కేవలం ప్లాస్టిక్ వ్యర్ధాలను తీసుకెళితే సరిపోతుంది.

ఆమధ్య ఇలానే ఒక చోట స్కూల్ ఫీజు గా ప్లాస్టిక్ వ్యర్ధాలను చెల్లించాలి అంటూ రూల్ పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు.ఐతే ఇప్పుడు అలానే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి వినూత్న నిర్ణయాన్ని అవలంభిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది.

India S First Garbage Cafe In Chhattisgarh--India S First Garbage Cafe In Chhattisgarh-

ఇంతకీ ఈ వింతైన పద్దతి ఎక్కడ అని అనుకుంటున్నారా, ఎక్కడో కాదు ఛత్తీస్ గడ్ లోని అంబికాపూర్ లో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నిరాశ్రయుల కోసం దేశంలోనే తొలిసారిగా ఇలాంటి గార్బేజ్ కేఫ్ పధకాన్ని ప్రవేశపెట్టారు.అంటే నిరాశ్రయులైన వారి కి ఉపయోగపడేవిధంగా అక్కడి మేయర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ప్లాస్టిక్‌ను సేకరించేందుకే ఈ గార్బేజ్ కేఫ్‌ను ఏర్పాటు చేశామని, దీనికి మున్సిపల్ బడ్జెట్‌లో రూ.5 లక్షలు కేటాయించామన్నారు.ఈ స్కిమ్ కింద నిరాశ్రయులకు వసతి సదుపాయం కూడా కల్పిస్తామని వెల్లడించారు...

అంబికాపూర్‌లో ఇప్పటికే ప్లాస్టిక్ వస్తువులపై నిషేదం ఉంది.అయితే ఇప్పుడు ఈ తాజా పధకం తో ఇక అక్కడ ప్లాస్టిక్ వ్యర్ధాలు అనేవి కనిపించడమే మానిస్తాయి అని చెప్పాలి.

ఒక కిలో ప్లాస్టిక్ వేస్ట్ తీసుకొచ్చేవారికి భోజనం, 500 గ్రాముల ప్లాస్టిక్ తీసుకొచ్చేవారికి బ్రేక్‌ఫాస్ట్ పెడతారు.ఇలా సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలతో మున్సిపాలిటీ రోడ్లను నిర్మిస్తామని, ఇప్పటికే 8 లక్షల ప్లాస్టిక్ బ్యాగ్‌లను ఉపయోగించి నగరంలో ఒక రోడ్డును నిర్మించామని మేయర్ అజయ్ తిర్కే తెలిపారు.